ఓటర్లను కేంద్రం మభ్యపెడుతోంది
ABN, First Publish Date - 2023-09-04T23:53:13+05:30
ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు బొడ్డేపల్లి సత్యవతి అన్నారు.
ఆమదాలవలస (పొందూరు), సెప్టెంబరు 4: ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు బొడ్డేపల్లి సత్యవతి అన్నారు. ఆమదాలవలస పట్టణంలో సోమవారం విలేఖరులతో మాట్లాడారు. 2014 లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజావ్యతిరేఖ విధానాలతో దేశం అల్లకల్లోలం అవుతోందన్నారు. దేశంలో నిత్యావసర ధరలు పెరుగుతూ పేద, మద్య తరగతి ప్రజల నడ్డి విుస్తున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో రూ 400 ఉన్న గ్యాస్ ధరను రూ 1200కు పెంచి కంటితుడుపు చర్యగా కేవలం రూ 200 తగ్గిందని విమ ర్శిస్తున్నారు. దేశాన్ని పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టి దేశాన్ని దివాలా తీయిస్తున్నారని విమర్శించారు. దేశంలో అత్యాచారాలు, మతవిద్వేషాలు పెరిగేలా చేసారని ఆరోపించారు. దేశాన్ని దారుణంగా నాశనం చేస్తున్న బీజేపీ చేతుల్లోంచి రక్షించేందుకు ప్రతీఒక్కరు ముందుకు రావాలన్నారు.
- రణస్థలం: వంట గ్యాస్ ధర పదేళ్ల కిందట రూ.300 ఉండగా, నేడు రూ.1,150 ఇస్తూ.. ఇప్పుడు ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండడంతో లబ్ధి పొందేందుకే రూ.200 తగ్గిస్తున్నట్టు కేంద్రం ప్రకటించిందని ఎచ్చెర్ల నియోజకవర్గం కాంగ్రెస్ నాయకుడు కొత్తకోట్ల సింహాద్రినాయుడు అన్నారు. సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ వైఖరి ప్రజలు గమనిస్తున్నారని, నిత్యావసర ధరల పెంపు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు, మణిపూర్‌లో జరుగుతున్న ఘనలు ప్రజలు గమనిస్తున్నారన్నారు. బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధిచెప్పే రోజులు ద్గర పడ్డాయన్నారు.
Updated Date - 2023-09-04T23:53:13+05:30 IST