ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భవనాలు సరే.. దారేదీ?

ABN, First Publish Date - 2023-03-31T00:02:14+05:30

వైసీపీ ప్రభుత్వహయాంలో జరుగుతున్న ఆర్‌బీకే, సచివాల య తదితర భవన నిర్మాణాలు కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకే తప్ప ప్రజలకు ఉపయోగపడేలా లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి.

దారి చూపకుండానే నిర్మిస్తున్న ప్రభుత్వ భవనం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

- ముందు ఆలోచన లేకుండా నిర్మాణాలు

- కాంట్రాక్టర్లకే ప్రయోజనం

- ప్రజా ధనం వృథా

పాతపట్నం: వైసీపీ ప్రభుత్వహయాంలో జరుగుతున్న ఆర్‌బీకే, సచివాల య తదితర భవన నిర్మాణాలు కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకే తప్ప ప్రజలకు ఉపయోగపడేలా లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఉదా హరణగా సీది గ్రామంలో సుమారు రూ.22.80లక్షల వ్యయంతో రైతుభరోసా కేంద్రాన్ని, రూ.45లక్షల వ్యయంతో సచి వాలయ భవన నిర్మాణం, రూ24.80 లక్షల వ్యయంతో వెల్‌నెస్‌ సెంటర్‌ ని ర్మాణాలు చేపట్టారు. దాదాపు పూర్తికా వచ్చాయి. అయితే ఆయా భవనాలకు చేరేందుకు సరైన రహదారి లేకపోవ డంతో గ్రామస్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది రూపాల యాల ప్రజా ధనాన్ని ప్రభుత్వం వృథా చేస్తుందని స్థానికులు మండిపడుతున్నార న్నారు. అయితే నిర్మాణాలు జరిగే ప్రాంగణమంతా రాళ్లమయమై ఉన్నాయి. కొత్తగా నిర్మిస్తున్న ఆయా కేంద్రాలకు వెళ్లేందుకు సరైన రహదారి లేకపోవ డంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. ఈ గ్రామానికి మంజూరైన పాలశీతల కేంద్రం పశువైద్యశాల, డిజిటల్‌ లైబ్రరీ నిర్మాణాలు అలాగే మరో రెండు అంగనవాడీ కేంద్రాల నిర్మాణాలు చేపట్టేందుకు కూడా ఇదే ప్రదేశాన్ని ప్రతిపాదిస్తున్నట్టు తెలుస్తుంది. ఏదిఏమైనా ప్రభుత్వ కార్యాలయాల భవన నిర్మాణాలు జరిగేప్పుడు పక్కా రహదారి సౌకర్యం ముందుగా ఏర్పాటు చేయాల్సి ఉండగా ఆ దిశగా ఇప్పటికీనిర్దేశిత స్పష్టత లేకపోడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయా ప్రభుత్వ కార్యాలయాలకు పక్కా రహ దారి ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. భవన నిర్మాణ పనులు పూర్తయ్యాక స్థలసేకరణ చేపట్టి అవసరమైతే కొనుగోలు చేసి అప్రోచ్‌ రోడ్‌ నిర్మాణం జరుపుతామని పీఆర్‌ డి.ప్రసాద్‌ తెలిపారు.

Updated Date - 2023-03-31T00:02:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising