చాకిపల్లి పాఠశాలలో టెక్కలి సబ్ కలెక్టర్
ABN, First Publish Date - 2023-01-28T23:40:32+05:30
చాకిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శనివారం టెక్కలి సబ్‌కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు.
టెక్కలి రూరల్: చాకిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శనివారం టెక్కలి సబ్‌కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి విద్యార్థులకు ప్రశ్నలు వేసి సమాధానాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల సిబ్బందికి పలు సూచనలు చేశారు. పాఠశాలలో జరుగుతున్న నాడు-నేడు సనులు, మధ్యాహ్న భోజనం, విద్యార్థుల ప్రగతి తదితర అంశాలపై సమీక్షించారు. మధ్యాహ్న భోజనం నిర్వహణపై అసం తృప్తిని వ్యక్తం చేశారు. పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం పి.జగదీశ్వరరావు, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.
Updated Date - 2023-01-28T23:40:33+05:30 IST