ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భావితరాల భవిష్యత్‌ కోసం టీడీపీ అవసరం

ABN, First Publish Date - 2023-02-17T00:06:26+05:30

భావితరాల భవిష్యత్‌ కోసం రాష్ట్రానికి టీడీపీ పాలన అవసరమని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కలమట వెంకటరమణమూర్తి అన్నారు. గురువారం టీడీపీ మండల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.

మాట్లాడుతున్న కలమట వెంకటరమణమూర్తి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెళియాపుట్టి: భావితరాల భవిష్యత్‌ కోసం రాష్ట్రానికి టీడీపీ పాలన అవసరమని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కలమట వెంకటరమణమూర్తి అన్నారు. గురువారం టీడీపీ మండల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. అవగాహన లేని ముఖ్యమంత్రి జగన్‌ రావడం వల్ల రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడి పోయిందన్నారు. ధాన్యం కొనుగోలు చేయమంటే కేసులు నమోదు చేసిన ప్రభుత్వాన్ని చూస్తున్నామన్నారు. ఉత్త రాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా చిరంజీవిరావును విజయానికి కృషి చేయా లని కోరారు. ఇప్పటినుంచే టీడీపీ విజయానికి పనిచేయాలన్నారు. కార్య క్రమంలో నాయకులు బి.లలితకుమారి, బాస్కర్‌గౌడో, యు.వసంత కుమార్‌, బి.దినకరరావు, కృష్టారావు, రామ్మోహన్‌, పరమేష్‌ రెడ్డి పాల్గొన్నారు.

ప్రతి ఓటరునూ కలవాలి

పాతపట్నం: ప్రతి ఓటరునూ కలిసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రథమ ప్రాధాన్యతా ఓటును టీడీపీ అభ్యర్థి వేపీడ చిరంజీవిరావుకు వేసేలా అవగాహన కలిగించాలని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణమూర్తి అన్నారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహిం చారు. జగన్మోహనరెడ్డి అసమర్థ పాలనతో అన్నిరకాల వస్తువుల ధరలు పెరిగి అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పేదల ఆకలి తీర్చేందుకే..

మెళియాపుట్టి: పేదల ఆకలి తీర్చేందుకే అన్న క్యాంటీన్‌లను పెడితే వైసీపీ ప్రభుత్వం ఎత్తివేసిందని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మూర్తి అన్నారు. గురువారం మెళియాపుట్టిలో టీడీపీ ఎన్‌ఆర్‌ఐ మహిళా విభాగం సహకారంతో భోజనం అందించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. ప్రతి గురువారం కొండల ప్రాంతాల నుంచి సంతకు గిరిజనులు వస్తారని, వారికోసం ఆ సమయంలో ప్రతివారం భోజనాలను ఏర్పాటు చేస్తా మన్నారు. ఇదిలా ఉండగా మెళియాపుట్టి కార్యదర్శి లక్ష్మణ్‌ రేణు శ్రీ అక్కడికి చేరుకుని ఎన్నికల కోడ్‌ ఉందని, ఫొటోలున్న వాహనంలో భోజనం పెట్టకూడ దని పేర్కొన్నారు. దీంతో కొద్దిమందికి భోజనం పెట్టి నిర్వాహకులు వెను దిరిగారు.

Updated Date - 2023-02-17T00:06:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising