ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

7 బీఈడీ కళాశాలల్లో అడ్మిషన్లు నిలిపివేత

ABN, First Publish Date - 2023-03-05T00:02:57+05:30

జిల్లాలో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి 7 బీఈడీ కళాశాలల్లో తొలి విడత కౌన్సెలింగ్‌లో అడ్మిషన్లు నిలిపేసినట్లు అంబే డ్కర్‌ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ నిమ్మ వెంకటరావు, సీడీసీ డీన్‌ ప్రొఫెసర్‌ పీలా సుజాత తెలిపారు. వర్సిటీలో శనివారం వీసీ వెంకటరావు ఆధ్వర్యంలో డయల్‌ యువర్‌ యూనివర్సిటీ కార్యక్రమం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

7 బీఈడీ కళాశాలల్లో అడ్మిషన్లు నిలిపివేత

- బీఆర్‌ఏయూ వీసీ వెంకటరావు

ఎచ్చెర్ల, మార్చి 4: జిల్లాలో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి 7 బీఈడీ కళాశాలల్లో తొలి విడత కౌన్సెలింగ్‌లో అడ్మిషన్లు నిలిపేసినట్లు అంబే డ్కర్‌ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ నిమ్మ వెంకటరావు, సీడీసీ డీన్‌ ప్రొఫెసర్‌ పీలా సుజాత తెలిపారు. వర్సిటీలో శనివారం వీసీ వెంకటరావు ఆధ్వర్యంలో డయల్‌ యువర్‌ యూనివర్సిటీ కార్యక్రమం జరిగింది. వర్సిటీ, అనుబంధ కళాశాలల విద్యార్థులు పలు అంశాలపై ఫోన్‌ చేశారు. పలు బీఈడీ కళా శాలలు నిబంధనలు పాటించడం లేదని ఓ అధ్యాపకుడు ఫిర్యాదు చేశారు. దీనిపైౖ సీడీసీ డీన్‌ సుజాత స్పందిస్తూ.. వర్సిటీ పరిధిలో 14 బీఈడీ కళాశా లలు ఉండగా ఏడు కళాశాలల్లో తొలి విడత అడ్మిషన్లు నిలిపేశామన్నారు. డిగ్రీ సెమిస్టర్‌, పునఃమూల్యాంకన ఫలితాలపై విద్యార్థులు ఫోన్‌ చేయగా.. ఫలితా ల వెల్లడిలో జాప్యం చేయొద్దని సంబంధిత అధికారులను వీసీ ఆదేశించారు. డిగ్రీ స్పెషల్‌ డ్రైవ్‌ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారని విద్యార్థులు అడగగా.. ప్రతి మూడేళ్లకోసారి ఈ పరీక్షలు నిర్వహిస్తామని పరీక్షల డీన్‌ ఎస్‌.ఉదయ భాస్కర్‌ సమాధానం చెప్పారు. డిగ్రీ పేపర్ల మూల్యాంకనం బకాయిలను చెల్లించాలని టెక్కలికి చెందిన అధ్యాపకుడు కోరగా.. కొన్ని మూల్యాంకన కేంద్రాల నుంచి బిల్లులు రాకపోవడంతో చెల్లింపుల్లో జాప్యం జరుగుతున్నట్టు అధికారులు సమాధానం ఇచ్చారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ సీహెచ్‌ ఏ రాజేంద్రప్రసాద్‌, ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ బిడ్డిక అడ్డయ్య, రీ వాల్యూయేషన్‌ డీన్‌ ఎం.అనూరాధ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-05T00:02:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising