ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సురక్ష ద్వారా 11రకాల సర్టిఫికెట్లు జారీ

ABN, First Publish Date - 2023-07-01T23:40:12+05:30

జగనన్న సరక్షలో 11 రకాల వివిధ సర్టిఫికెట్లు జారీ చేయనున్నామని కలెక్టర్‌ శ్రీకేష్‌ బీ లఠ్కర్‌ అన్నారు. శనివారం బోరుభద్రలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని 732 సచివాలయాల ద్వారా ఈనెల 27వ తేదీ వరకు ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లు అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. సర్టిఫికెట్లు అవసరమైన వారు నేరుగా సచివాలయాల్లో సంప్రదించాలని సూచించారు. ఈ

సంతబొమ్మాళి: మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ శ్రీకేష్‌ బీ లఠ్కర్‌

సంతబొమ్మాళి, జూలై 1: జగనన్న సరక్షలో 11 రకాల వివిధ సర్టిఫికెట్లు జారీ చేయనున్నామని కలెక్టర్‌ శ్రీకేష్‌ బీ లఠ్కర్‌ అన్నారు. శనివారం బోరుభద్రలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని 732 సచివాలయాల ద్వారా ఈనెల 27వ తేదీ వరకు ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లు అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. సర్టిఫికెట్లు అవసరమైన వారు నేరుగా సచివాలయాల్లో సంప్రదించాలని సూచించారు. ఈ కార్య క్రమం పర్యవేక్షణకు నియోజక వర్గ స్థాయిలో ఒక ప్రత్యేక అఽధి కారితో పాటు మండల స్థాయిలో మరో అధికారిని నియమిస్తు న్నట్లు చెప్పారు. ప్రజలకు సచివాలయాలపై నమ్మకం పెరి గేలా సిబ్బంది పని చేయాలన్నారు. కార్యక్రమంలో టెక్కలి సబ్‌ కలెక్టర్‌ రాహుల్‌ కుమార్‌ రెడ్డి, మండల ప్రత్యేకాధికారి శ్రీని వాసరావు, టెక్కలి వైసీపీ ఇన్‌చార్జి దువ్వాడ వాణి, సర్పంచ్‌ బుసకల లక్ష్మీ కాంతం, ఎంపీటీసీ చింతాడ జయచిన్నారావు, పీఏసీఎస్‌ చైర్మన్‌ కెల్లి జగన్నాయకులు పాల్గొన్నారు.

ప్రజలను సంతృప్తిపరచడమే లక్ష్యం

నరసన్నపేట: ప్రజల నుంచి వచ్చే వినతులు పరిష్కరించి వారిని సంతృప్తి పరచడమే జగనన్న సురక్ష ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. తామరాపల్లి, జమ్ము గ్రామ సచివాలయాల్లో ఈ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఆరంగి మురళీ, డీసీసీబీ అధ్యక్షుడు రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

జగనన్న సురక్షను సద్వినియోగం చేసుకోండి

నందిగాం: జగనన్న సురక్ష పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో టి.సీతారామ్మూర్తి అన్నారు. శనివారం హరిదాసుపురంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిం చారు. ఈ కార్యక్రమం ద్వారా 11 రకాల సర్టిఫికెట్లు అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కాళింగ కార్పొరేషన్‌ రాష్ట్ర చైర్మన్‌ పేడాడ తిలక్‌, సర్పంచ్‌ సర్పంచ్‌ కణితి ధనలక్ష్మి, స్థానిక నాయకుడు నారాయణమూర్తి, ఎంపీపీ ఎన్‌.శ్రీరామ్మూర్తి, పీఏ సీఎస్‌ అధ్యక్షుడు కె.బాలకృష్ణారావు, తహసీల్దార్‌ వైఏ పద్మా వతి, ఎంపీడీవో శివప్రసాద్‌, ప్రత్యేకాధికారి బి.మురళీ కృష్ణ, డీటీ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-01T23:40:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising