క్రీడలతో ఒత్తిడి దూరం
ABN, First Publish Date - 2023-03-02T00:00:24+05:30
క్రీడలు విద్యార్థులకు నాయకత్వ లక్షణాలతోపాటు ఒత్తిడి అదిగమించేందుకు దోహదపడతాయని డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ పి.సాం బశివరావు అన్నారు.
- డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ సాంబశివరావు
- నైర కళాశాలలో రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు
శ్రీకాకుళం అర్బన్: క్రీడలు విద్యార్థులకు నాయకత్వ లక్షణాలతోపాటు ఒత్తిడి అదిగమించేందుకు దోహదపడతాయని డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ పి.సాం బశివరావు అన్నారు. నైర కళాశాలలో నిర్వహించిన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోని వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలల రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల్లోని నైపుణ్యత వెలికితీసేందుకు ఇటువంటి పోటీలు దోహదపడతాయన్నారు. డైరెక్టర్ ఆఫ్ పాలిటెక్నిక్ డాక్టర్ ఎం.శ్రీరేఖ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో మానవ సంబంధాలు మెరుగుపడేందుకు, క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు అలవర్చుకోడానికి పోటీలు అవసరమన్నారు. అంతకు ముందు వివిధ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులచే మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. అసోసియేట్ డీన్ డాక్టర్ డి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యూకేషన్ అబ్జర్వర్ కె.రమాకాంత్ రెడ్డి, డాక్టర్ ఎస్.గోవిందరావుతోపాటు రాష్ట్రంలోని 21 వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలల నుంచి సుమారు 420 విద్యార్థులు పాల్గొన్నారు.
Updated Date - 2023-03-02T00:00:24+05:30 IST