ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఎస్టీ కుల ధ్రువపత్రాలు జారీ చేయాలి

ABN, First Publish Date - 2023-08-02T00:03:12+05:30

ఎస్టీ కుల ధ్రువ పత్రాలు జారీ చేయాలని రత్తకన్న గ్రామానికి చెందిన బెంతు ఒరియా కులస్థులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం రత్తకన్న గ్రామానికి చెందిన బెంతు ఒరియా కులస్థులు భారీ ర్యాలీ చేపట్టారు.

నినాదాలు చేస్తున్న బెంతుఒరియాలు

ఇచ్చాపురం: ఎస్టీ కుల ధ్రువ పత్రాలు జారీ చేయాలని రత్తకన్న గ్రామానికి చెందిన బెంతు ఒరియా కులస్థులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం రత్తకన్న గ్రామానికి చెందిన బెంతు ఒరియా కులస్థులు భారీ ర్యాలీ చేపట్టారు. రత్తకన్నలో ప్రారంభమైన ర్యాలీ డిగ్రీ కళాశాల మీదుగా, వీకే పేట, దాసన్నపేట, మార్కెట్‌ రోడ్డు మీదుగా బస్టాండ్‌ వరకు ర్యాలీ సాగింది. అనంతరం పాత బస్టాండ్‌ జంక్షన్‌ వద్ద గల అంబేడ్కర్‌ విగ్రహం వద్ద రిలే నిరహార దీక్ష చేపట్టారు. బెంతు ఒరియాలకు కుల ధ్రువ పత్రాలు లేకపోవడంతో విద్యార్థులు అన్ని విధాలుగా అవకాశాలు కోల్పోతున్నారని ఆ కుల సంఘ నాయకుడు ప్రేమ్‌కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. దీక్ష శిబిరానికి చేరుకున్న జనసేన పార్టీ ఇన్‌చార్జి దాసరి రాజు, టీడీపీ సీనియర్‌ నాయకుడు, 22వ వార్డు కౌన్సిలర్‌ కాళ్ల దిలీప్‌ సంఘీభావం తెలిపి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం స్పందించి కులధ్రువీకరణ పత్రాలు అంజూరు చేయాని లేకుంటే ప్రాణత్యాగానికి కూడా వెనకాడమని కులస్థులు హెచ్చరించారు.

Updated Date - 2023-08-02T00:03:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising