ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘ఇచ్ఛాపురం’లో కరువు ఛాయలు

ABN, First Publish Date - 2023-09-22T00:03:49+05:30

ఇచ్ఛా పురం నియోజకవర్గంలో దారుణ పరిస్థితులు నెలకొ న్నాయి.

పలాసపురం వద్ద ఉభాలుకాని పొలాలు

- జరగని ఉభాలు

- ఆశలు వదులుకున్న నియోజక వర్గ రైతులు

కంచిలి/సోంపేట, సెప్టెంబరు 21: ఇచ్ఛా పురం నియోజకవర్గంలో దారుణ పరిస్థితులు నెలకొ న్నాయి. సరైన నిర్వహణ లేక సాగునీటి వనరులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో ఏటా ఖరీఫ్‌లో సాగునీటి కష్టాలు తప్ప డం లేదు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాం తాల్లో ఉబాలు పూర్తయ్యాయి. కానీ ఒక్క ఇచ్ఛాపు రం నియోజకవర్గంలో మాత్రం పూర్తికాలేదు. దాదా పు రైతులు ఆశలు వదులుకున్నారు. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గంలోని నాలుగు మండలాలను కరువు జాబితాలో చేర్చితే రైతులు కోరుతున్నారు.

నియోజకవర్గంలో మహేంద్రతనయా, బాహుదా నదులు ప్రధాన సాగునీటి వనరులు. మరో 200 వరకూ చెరువులు ఉన్నాయి. పైడిగాం, బాహుదా ఓపెన్‌ హెడ్‌ చానెళ్లు 11, వాటి పరిధిలో పదుల సంఖ్యలో గ్రోయిన్లు ఉన్నాయి. సీతసాగరం, పొత్ర ఖండ- కర్తలిపాలెం సాగరం, గంగాసాగరం, గోవిందసాగరం, సుంకిడి సాగరం వంటి సాగునీటి వనరులు ఉన్నాయి. కానీ దశాబ్దాలుగా నిర్వహణ లేకపోవడంతో రైతులకు శాపంగా మారింది.

- బాహుదా నది ఇచ్ఛాపురం మండలానికి ప్రధాన సాగునీటి వనరు. దాదాపు 15 పంచాయ తీల పరిధిలో పది వేల ఎకరాలకు సాగునీరు అంది స్తుంది. ఓపెన్‌ హెడ్‌ చానళ్లు, గ్రోయిన్లు దెబ్బతిన డంతో రైతులే సొంతంగా డబ్బులు వేసుకొని బాగుచేసుకోవాల్సి వస్తోంది. బగలబట్టి ప్రాంతంలో నదిపై 106 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టును ఒడిశా ప్రభుత్వరం నిర్మించారు. దీంతో నీటి ప్రవాహం గననీయంగా తగ్గిపోయింది.

- మహేంద్రతనయా నదిపై సోంపేట మండ లం బాతుపురం సమీపంలో నిర్మించిన పైడిగాం ప్రాజెక్టు 2018లో తితలీ తుఫాన్‌కు కొట్టుకుపోయిం ది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.36 కోట్లతో ప్రాజెక్టును ఆధునికీకరణ చేపట్టను న్నట్టు ప్రకటించారే తప్పా నేటికీ అమలు కాలేదు. ఎగువ ప్రాంతంలో పురియాసాయి వద్ద ఒడిశా ప్ర భుత్వం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. కనీసం 40 క్యూసెక్కుల నీరు కూడా రావడం లేదు. తూర్పు కనుమల నుంచి వచ్చే వర్షపు నీటిని నిల్వ చేసేం దుకు లడ్డగుడ్డి వద్ద మినీ రిజర్వాయర్‌ నిర్మిస్తే ప్రయోజనం ఉంటుంది.

- వంశధార జలాలను ఇప్పటికే పలాస నియో జకవర్గం కిడిసింగి వరకూ విస్తరించారు. దానిని ఇ చ్ఛాపురం వరకూ పొడిగిస్తే నియోజకవర్గానికి మహర్దశే.

ఉభాలు అంతంతే..

ఇచ్ఛాపురం మండలంలో 9,150 ఎకరాల ఆయక ట్టు ఉంది. అందులో కేవలం 4వేల ఎకరాల్లోనే ఉభాలు జరిగాయి. కంచిలి మండలంలో 12 వేల ఎకరాలకుగాను కనీసం నాలుగు వేల ఎకరాల్లో కూడా ఉభాలు జరగలేదు. గోకర్నపురం, జలంత్రకోట, మధుపురం, శాసనం పంచాయతీల్లో పూర్తిగా ఉబాలు కాలేదు. సోంపేట మండలంలో 10,200 ఎకరాలకుగాను నాలుగు వేల ఎకరాల్లో ఉభాలు జరిగాయి. ఈ పరిస్థితుల్లో ఇచ్ఛాపురం నియోజకవర్గాన్ని కరువు జాబితాలో చేర్చాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2023-09-22T00:03:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising