ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సర్పంచ్‌ల హక్కులు కాలరాస్తే సహించం

ABN, First Publish Date - 2023-04-11T00:09:13+05:30

సర్పంచ్‌ల హక్కులను కాలరాస్తే సహించేది లేదని ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు గొండు శంకర్‌ అన్నారు.

మాట్లాడుతున్న గొండు శంకర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

- సర్పంచ్‌ల సంఘ జిల్లా అధ్యక్షుడు గొండు శంకర్‌

అరసవల్లి: సర్పంచ్‌ల హక్కులను కాలరాస్తే సహించేది లేదని ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు గొండు శంకర్‌ అన్నారు. నగరంలోని ఓ హోటల్‌లో రాష్ట్ర పంచాయతీ చాంబర్‌, రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం ఆదేశాల మేరకు సోమవారం అఖిలపక్ష సర్పంచ్‌ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్‌ మాట్లాడుతూ.. సర్పంచ్‌ల విధులు, రాజ్యాంగం క ల్పించిన హక్కులపై చర్చ, ఉద్యమ కార్యాచరణ, ని యోజకవర్గ, జిల్లా స్థాయి కమిటీలపై చర్చించి నిర్ణ యాలు తీసుకున్నామని తెలిపారు. గ్రామ సచివాల యాలను, వలంటీర్లను పంచాయతీల్లో విలీనం చేసి, సర్పంచ్‌ల ఆధ్వర్యంలోనే పని చేయించాలని కోరారు. గతంలో వలే ఉపాధి హామీ పథకం పనులను, నిధు లను గ్రామ పంచాయతీల అధీనంలోకి తీసుకురా వాలని డిమాండ్‌ చేశారు. మైనర్‌ పంచాయతీలకు ఉచిత విద్యుత్‌ విధానాన్ని కొనసాగించాలని కోరారు. గ్రామ పంచాయతీలతో సంబంధం లేకుండా సచివా లయ ఉద్యోగులు సమాంతర వ్యవస్థగా పనిచేస్తు న్నారని, ఇది సర్పంచ్‌ల ఆత్మాభిమానాన్ని కించపరి చినట్టేనని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్ర మాల్లో సర్పంచ్‌లకు ప్రోటోకాల్‌ ఇచ్చేలా అధికారుల కు ఆదేశాలివ్వాలని డిమాండ్‌ చేశారు. సర్పంచ్‌లు కొంక్యాన ఆదినారాయణ, రుప్ప లక్ష్మి, రంధి రాజేశ్వరి, నరేష్‌, లక్ష్మీనారాయణ, బి.రామారావు, కర్రి సీతా రత్నం, ఎన్‌.లక్ష్మారెడ్డి, వి.రవికుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-04-11T00:09:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising