ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గ్రామీణ రహదారులు ఛిద్రం

ABN, First Publish Date - 2023-08-02T00:03:34+05:30

వైసీపీ నాలుగేళ్ల పాలనలో గ్రామీణ రహదారులు ఛిద్రంగా తయారై ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి విమర్శించారు. లంబ గ్రామం నుంచి గోవర్థనపురం మీదుగా ఉన్న రోడ్డుపై ఏర్పడిన గోతుల్లో మంగళవారం వరి నాట్లు వేసి నిరసన తెలిపారు.

జలుమూరు (సారవకోట): గోవర్థనపురం రోడ్డుపై వరినాట్లు వేసి నిరసన తెలుపుతున్న మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

జలుమూరు (సారవకోట), ఆగస్టు 1: వైసీపీ నాలుగేళ్ల పాలనలో గ్రామీణ రహదారులు ఛిద్రంగా తయారై ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి విమర్శించారు. లంబ గ్రామం నుంచి గోవర్థనపురం మీదుగా ఉన్న రోడ్డుపై ఏర్పడిన గోతుల్లో మంగళవారం వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో మారుమూల గ్రామాలకు రహదారులు నిర్మించామన్నారు. ఇందులో భాగంగా లంబ నుంచి గోవర్థనపురం మీదుగా వాబ వరకు పక్కా రహదారి నిర్మాణానికి రూ.75 లక్షలు మంజూరుచేసి రోడ్డుపనులు ప్రారంభించి 60 శాతం పనులు చేశామన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు నిలిచిపోయాయన్నారు. దీంతో ప్రజలు ఇబ్బందులుపడు తున్నారన్నారు. ఇటీవల ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసు గ్రామానికి వచ్చినపుడు ప్రజలు రోడ్డు బాగుచేయించాలని కోరారని, రెండు నెలల్లో పక్కా రోడ్డు వేయి స్తానని హామీ ఇచ్చి 5 నెలలైనా నేటికీ ఆ ఊసే లేదన్నారు. రానున్న ఎన్ని కల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ధర్మాన తేజకుమార్‌, కత్తిరి వెంకటరమణ, సురవరపు తిరుపతిరావు, బైరి భాస్కరరావు, పి.రత్నాలనాయుడు, తాడేల భీమారావు, ఎం.మోహనరావు, ఇ.నాగరాజు, పట్ట ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

దిమిలి రోడ్డుపైనా..

కొత్తూరు: మండలంలోని అధ్వానంగా ఉన్న దిమిలి రోడ్డు గుంతల్లో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. మంగళశారం ఈ రోడ్డును పరిశీలించారు. గోతుల్లో నీరు నిలిచిపోయి రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నా అధికారులు స్పందించకపో వడం దారుణమన్నారు. ప్రజలకు సదుపాయాల కల్పనపై దృష్టి సారించాల్సిన ఎమ్మెల్యే రెడ్డి శాంతి వాటిని వదిలి పెట్టి ఇసుక ర్యాంపుల నుంచి అక్రమంగా సొమ్ము పోగేసు కుంటున్నారని విమర్శించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు దారపు కృష్ణారావు, అచ్యుతరావు, కాశీబాబు, శీనుబాబు, రేగళ వాసు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా టీడీపీ రాష్ట్ర అధ్య క్షుడు కింజరాపు అచ్చెన్నాయుడును పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణ మూర్తి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాగర్‌ మంగళవారం కోటబొమ్మాళి ఎన్టీఆర్‌ భవన్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈనెల 10న పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వంశధార ప్రాజెక్టు సందర్శనకు వస్తున్నందున చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించారు.

Updated Date - 2023-08-02T00:03:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising