ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రాజగోపాలరావు.. భావితరాలకు చైతన్య స్ఫూర్తి

ABN, First Publish Date - 2023-06-26T00:02:29+05:30

జిల్లాలోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా అరుదైన వ్యక్తి త్వం గల గొప్ప నాయకుడు బొడ్డేపల్లి రాజగోపాలరావు అని, భావితరాలకు ఆయన చైతన్యస్ఫూర్తిగా నిలుస్తారని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు కొనియాడా రు.

పుస్తకావిష్కరణలో ఎంపీ రామ్మోహన్‌నాయుడు తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు

అరసవల్లి: జిల్లాలోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా అరుదైన వ్యక్తి త్వం గల గొప్ప నాయకుడు బొడ్డేపల్లి రాజగోపాలరావు అని, భావితరాలకు ఆయన చైతన్యస్ఫూర్తిగా నిలుస్తారని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు కొనియాడా రు. ఆదివారం బొడ్డేపల్లి శతజయంత్యుత్సవాల ముగింపు సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ఆయన చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా ఎన్నటికీ మర్చిపోలేనివని, జిల్లా చరిత్రలో ఆయన ప్రస్థానం ఒక సువ ర్ణాధ్యాయమన్నారు. భవిష్యత్తు తరాలకు ఆయన జీవిత చరిత్రను తెలియజేసి చైతన్యవంతులను చేయడానికి అందరూ ముందుకు రావాలని కోరారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ మాట్లాడుతూ.. 75 ఏళ్ల చరిత్రలో ఎవ్వరూ సాధించలేని పేరు ప్రఖ్యాతులను సాధించుకున్న మహోన్నత వ్యక్తి బీఆర్‌ఆర్‌ అని కొనియాడారు. రాజకీయాలకు, కుల మతాలకు అతీతంగా పనిచేశారని, ఆయన స్ఫూర్తితోనే తామంతా రాజకీయాల్లో ఉన్నట్లు తెలిపారు.

బొడ్డేపల్లి ఆశయాలను నెరవేరుద్దాం

అరసవల్లి: బొడ్డేపల్లి ఆశయాలను నెరవేర్చాలని స్పీకర్‌ తమ్మినేని సీతారాం, రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఆదివారం బొడ్డేపల్లి రాజగోపాల రావు శతజయంత్యుత్సవాల ముగింపు కార్యక్రమం సందర్భంగా స్థానిక ఏడురోడ్ల జంక్షన్‌ వద్ద వారు బీఆర్‌ఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బొడ్డేపల్లి సేవలు గుర్తించి ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహిస్తున్నా మని తెలిపారు. ఆరుసార్లు ఎంపీగా ఎన్నికైనా మచ్చలేని నాయకునిగా భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలిచారన్నారు. కలెక్టర్‌ లఠ్కర్‌ మాట్లాడుతూ.. బీఆర్‌ఆర్‌ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, జడ్పీ చైర్మన్‌ పిరియా విజయ, ఎస్పీ జీఆర్‌ రాధిక, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, మాజీ ఎమ్మెల్యేలు పిరియా సాయిరాజ్‌, బగ్గు రమణమూర్తి, డీసీసీ అధ్యక్షురాలు బొడ్డేపల్లి సత్యవతి, బీజేపీ నాయకులు పూడి తిరుపతిరావు, అట్టాడ రవిబాబ్జీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T00:02:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising