రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
ABN, First Publish Date - 2023-09-04T00:07:28+05:30
వజ్జీలపేట సమీప జాతీయరహదారిపై ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలయ్యాయి.
నందిగాం, సెప్టెంబరు 3: వజ్జీలపేట సమీప జాతీయరహదారిపై ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలయ్యాయి. కోటిపల్లి గ్రామా నికి చెందిన దట్టి అప్పయ్య పలాస మండలం తాళ్లభద్ర వెళ్లి తిరిగి స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై వస్తుండగా వజ్జీలపేట సమీపంలో వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొంది. దీంతో అప్పయ్యకు గాయపడ్డాడు. ఇదే సమయంలో శ్రీకాకుళం వైపు వెళ్తున్న మంత్రి సీదిరి అప్పలరాజు గమనించి అప్పయ్యకు సమర్యలు చేసి హైవే అంబులెన్స్‌లో టెక్కలి జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు.
వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురికి..
లావేరు: మండలంలోని ఆదివారం రాత్రి జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురికి గాయాలైయ్యాయి. శ్రీకాకుళం నుంచి రణస్థలం వైపు వస్తుండగా బు డుమూరు వద్ద ముందు వెళ్తున్న ఆటోను ఓ కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో లో ప్రయాణిస్తున్న అల్లాడ సాంబశివరావు, అతని భార్య సౌమ్య, అత్తమామలు సత్యవతి, సూర్యనారాయణ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108 వాహనంలో శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తంగా తరలించారు. వీరిది విజయ నగరం జిల్లా వేపాడ మండలం తెట్టంగి గ్రామం. వీరు ఆదివారం తెట్టంగి నుంచి అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయానికి వెళ్లి మొక్కులు చెల్లించుకొని తిరిగి ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అదే విధంగా అదపాక జంక్షన్ వద్ద గల జాతీయ రహదారి పై రణస్థలం వైపు బైక్ పై వెళ్తున్న కొండములగాం గ్రామానికి చెందిన పిన్నింటి గౌరినాయుడును ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ ఢీ కొంది. ఈ ప్రమాదంలో గౌరినాయుడు తీవ్రంగా పడ్డారు. ఇతడిని చికిత్స నిమి త్తంగా 108 వాహనంలో శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు.
Updated Date - 2023-09-04T00:07:28+05:30 IST