ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి

ABN, First Publish Date - 2023-06-17T23:45:51+05:30

సంసద్‌ ఆదర్శ గ్రామ్‌ యో జన పథకం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మరిం త మెరుగుపడాలని, ఆ దిశగా అధికారులు కృషిచే యాలని జేసీ ఎం.నవీన్‌ పిలుపునిచ్చారు.

మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ నవీన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఆదర్శ గ్రామాల అభివృద్ధిపై సమీక్షలో జేసీ నవీన్‌

శ్రీకాకుళం అర్బన్‌: సంసద్‌ ఆదర్శ గ్రామ్‌ యో జన పథకం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మరిం త మెరుగుపడాలని, ఆ దిశగా అధికారులు కృషిచే యాలని జేసీ ఎం.నవీన్‌ పిలుపునిచ్చారు. సంసద్‌ ఆ దర్శ గ్రామ్‌ యోజన పథ కం ద్వారా జిల్లాలో ఎంపికైన ఆదర్శ గ్రామాల్లో నిర్ధిష్ట ప్రణాళికపై కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి సమావేశం జేసీ అధ్యక్షతన శనివారం జరిగిం ది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రజల ఆర్థిక, సామాజిక అభివృద్ధి, సుపరిపాలన దిశగా ప్రణాళిక లను రూపొందించి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాల ని సూచించారు. ముఖ్యంగా ఎంపీడీవోలు, ఈవో పీఆ ర్డీలు, పంచాయతీ కార్యదర్శులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. ఆదర్శ గ్రామాలైన సోంపేట మండలం ఇసకలపాలెం, పలాస మం డలం గురుదాసపురం, కొత్తూరు మండలం కుద్దిగాం, శ్రీకాకుళం మండలం నైర, పొందూరు మండలం తండ్యాం ప్రాంతాల్లో అభివృద్ధి ప్రణాళికలు సకాలం లో అమలు చేయాలన్నారు. సమావేశంలో జడ్పీ సీఈవో ఆర్‌.వెంకట్రామన్‌, ముఖ్యప్రణాళి కాధికారి వీఎస్‌ఎస్‌ లక్ష్మీప్రసన్న, డీఎంహెచ్‌వో బి.మీనాక్షి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు

గార: శాలిహుండాం కొండ దగ్గరలో పర్యాటకశాఖకు చెందిన టూరిస్ట్‌ ఎమినిటి సెంటర్‌ (పర్యాటకులకు వసతి సౌకర్యం)లో పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని జేసీ నవీన్‌ ఆదేశించారు. శనివారం ఉదయం ఆయన శాలిహుండాం కొండ దగ్గరలో నిర్మాణం జరిగిన పర్యాటకుల సౌకర్య కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఈ భవనం నిర్మాణం కోసం సేకరించిన భూమి వివరాలు సర్వే నెంబర్‌ మొదలైన అంశాలపై తహసీల్దార్‌ జెన్ని రామారావును అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలో ఎన్నో చారిత్రక కట్టడాలు ఉన్నాయని, వాటిని సందర్శించడానికి వచ్చే పర్యాటకులకు ఈ కేంద్రంలో విశ్రాంతి కోసం, వసతి సౌకర్యం, క్యాంటీన్‌ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాలని జిల్లా పర్యాటక శాఖ అధికారి ఎస్‌.నారాయణరావుకు సూచించారు. సర్పంచ్‌ కె.ఆదినారాయణ, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-17T23:45:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising