చెత్తసంపద కేంద్రం వద్దు
ABN, First Publish Date - 2023-09-22T00:02:16+05:30
కోటబొమ్మాళి ప్రకాషనగర్ కాలనీకి సమీపంలో గల కొండ పక్కన ఉన్న జగనన్నకాలనీకి ఆనుకొని ఉన్న చెత్తసంపద కేంద్రం ఏర్పాటుచేయడంపై నిరసన వ్యక్తమవుతోంది. పంచాయతీ పరిధిలోని చెత్త సేకరించి ఇక్కడ డంప్ చేస్తుండడంతో కుళ్లి దుర్వాసన వస్తుండడంతో రోగాల బారినపడుతున్నామని, దీనిని మరోచోటికి మార్చాలని జగనన్నకాలనీవాసులు డిమాండ్‌చేస్తున్నారు. ఇక్కడ కాలనీలో 115 మందికి స్థలాలు కేటాయించారు. ప్రస్తుతం 70 ఇళ్లనిర్మాణం పూర్తికాగా 30 మంది గృహప్రవేశాలుచేశారు. జగ నన్న కాలనీలో ఇచ్చిన స్థలాల్లో ప్రభుత్వం అందించిన ఆర్థికసాయం సరిపోక పోవడంతో అప్పులుచేసి ఇళ్లు నిర్మించుకున్నామని పలువురు తెలిపారు. ఈ నేపథ్యంలో తమ కాలనీ పక్కన ఉన్న చెత్తసంపద కేంద్రంలో వేసిన తడి, పొడిచెత్త వల్ల దుర్వాసన వస్తుండడంతో ఇబ్బందిప డుతున్నామని పలువురు వాపోతున్నారు.కాలనీకి ఎటువంటి మౌలిక సదుపా యాలు లేకపోయినా అష్టకష్టాలుపడి ఇళ్లు నిర్మిం చామని, ఇంతలో ఇక్కడే చెత్త సంపద కేంద్రం ఏర్పా టుచేయడంతో దోమలు స్వైరవిహారంచేస్తుండడంతో అవస్థలు పడుతున్నామని తెలిపారు. తక్షణమే పంచాయతీ అధికారులు స్పం దించి చెత్తసంపద క్రేందాన్ని మరో చోటకు మార్చాలని వారు కోరారు. కాగా తాను చెత్తసంపద కేంద్రాన్ని పరిశీలించి, మరోచోటికి మారుస్తానని ఎంపీడీవో ఫణీం ద్రకుమార్ తెలిపారు.
కోటబొమ్మాళి: కోటబొమ్మాళి ప్రకాషనగర్ కాలనీకి సమీపంలో గల కొండ పక్కన ఉన్న జగనన్నకాలనీకి ఆనుకొని ఉన్న చెత్తసంపద కేంద్రం ఏర్పాటుచేయడంపై నిరసన వ్యక్తమవుతోంది. పంచాయతీ పరిధిలోని చెత్త సేకరించి ఇక్కడ డంప్ చేస్తుండడంతో కుళ్లి దుర్వాసన వస్తుండడంతో రోగాల బారినపడుతున్నామని, దీనిని మరోచోటికి మార్చాలని జగనన్నకాలనీవాసులు డిమాండ్‌చేస్తున్నారు. ఇక్కడ కాలనీలో 115 మందికి స్థలాలు కేటాయించారు. ప్రస్తుతం 70 ఇళ్లనిర్మాణం పూర్తికాగా 30 మంది గృహప్రవేశాలుచేశారు. జగ నన్న కాలనీలో ఇచ్చిన స్థలాల్లో ప్రభుత్వం అందించిన ఆర్థికసాయం సరిపోక పోవడంతో అప్పులుచేసి ఇళ్లు నిర్మించుకున్నామని పలువురు తెలిపారు. ఈ నేపథ్యంలో తమ కాలనీ పక్కన ఉన్న చెత్తసంపద కేంద్రంలో వేసిన తడి, పొడిచెత్త వల్ల దుర్వాసన వస్తుండడంతో ఇబ్బందిప డుతున్నామని పలువురు వాపోతున్నారు.కాలనీకి ఎటువంటి మౌలిక సదుపా యాలు లేకపోయినా అష్టకష్టాలుపడి ఇళ్లు నిర్మిం చామని, ఇంతలో ఇక్కడే చెత్త సంపద కేంద్రం ఏర్పా టుచేయడంతో దోమలు స్వైరవిహారంచేస్తుండడంతో అవస్థలు పడుతున్నామని తెలిపారు. తక్షణమే పంచాయతీ అధికారులు స్పం దించి చెత్తసంపద క్రేందాన్ని మరో చోటకు మార్చాలని వారు కోరారు. కాగా తాను చెత్తసంపద కేంద్రాన్ని పరిశీలించి, మరోచోటికి మారుస్తానని ఎంపీడీవో ఫణీం ద్రకుమార్ తెలిపారు.
Updated Date - 2023-09-22T00:02:16+05:30 IST