ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రోడ్లు లేవు.. కొళాయిల్లేవ్‌

ABN, First Publish Date - 2023-07-21T23:53:08+05:30

‘మా గ్రామానికి ఐదేళ్లుగా రోడ్డు లేదు. కనీస సౌకర్యాలు లేవు. మేము ఏం పాపం చేశామ’ని రావులవలస గ్రామస్థులు నిలదీశారు.

డీఈఈ వెంకటరావును ప్రశ్నిస్తున్న రావులవలస గ్రామస్థులు

- మా గ్రామానికి ఇంతవరకూ ఎమ్మెల్యే రాలేదు

- ‘సురక్ష’లో రావులవలస గ్రామస్థుల నిలదీత

నరసన్నపేట, జూలై 21: ‘మా గ్రామానికి ఐదేళ్లుగా రోడ్డు లేదు. కనీస సౌకర్యాలు లేవు. మేము ఏం పాపం చేశామ’ని రావులవలస గ్రామస్థులు నిలదీశారు. శుక్రవారం రావులవలసలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో అధికారులను ప్రశ్నించారు. గ్రామంలో రోడ్లు బాగోలేవని.. ఇంటింటా కొళాయిలు లేవని.. ప్రభుత్వ భవనాల నిర్మాణాలు పునాదులకే పరిమితమయ్యాయని గ్రామానికి చెందిన మడ్డు కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తమ గ్రామానికి ఇంతవరకూ రాలేదని.. తామేమి పాపం చేశామో చెప్పాలని మండలస్థాయి నాయకులను నిలదీశారు. రోడ్డు పనులు సగంలో ఎందుకు నిలిపేశారని డీఈఈ వెంకటరావును గ్రామస్థులు నిలదీశారు. ఎంపీపీ ఆరంగి మురళీధర్‌ మాట్లాడుతూ.. గ్రామ సమస్యలు ఎమ్మెల్యే కృష్ణదాస్‌ దృష్టిలో ఉన్నాయని తెలిపారు. అంచెలంచెలుగా గ్రామాలను అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో చింతు రామారావు, ఏవో సునీత, డీటీ సరిత, ఐసీడీఎస్‌ పీవో నాగమణి పాల్గొన్నారు.

Updated Date - 2023-07-21T23:53:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising