ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాతృభాష ఔన్నత్యాన్ని చాటిచెప్పాలి

ABN, First Publish Date - 2023-02-21T23:57:31+05:30

మాతృభాష ఔన్నత్యాన్ని ప్రతిఒక్కరికీ చాటిచెప్పాలని వక్తలు పిలుపునిచ్చారు. జిల్లాలోని వివిధ పాఠశాలలు, కళాశాలల్లో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

21 ఎస్‌బీఎం1: సంతబొమ్మాళి: అ అక్షర రూపంలో విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం అర్బన్‌/టెక్కలి/నరసన్నపేట/సంతబొమ్మాళి/ పాతపట్నం/ఎచ్చెర్ల/ ఇచ్ఛాపురంరూరల్‌/పలాసరూరల్‌/జి.సిగ డాం: మాతృభాష ఔన్నత్యాన్ని ప్రతిఒక్కరికీ చాటిచెప్పాలని వక్తలు పిలుపునిచ్చారు. జిల్లాలోని వివిధ పాఠశాలలు, కళాశాలల్లో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎచ్చెర్లలోని అంబేడ్కర్‌ యూనివర్సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో వీసీ ప్రొఫెసర్‌ నిమ్మ వెంకటరా వు మాట్లాడుతూ.. మాతృభాషలోని గొప్పతనాన్ని ప్రతిఒక్కరూ గుర్తించాలని కోరారు. అవధాన ప్రక్రియ తెలుగు భాష విశిష్టతను, ఔనత్యాన్ని చాటుతుంద న్నారు. విద్యార్థులు భాష పట్ల అభిరుచి పెంచుకోవాలన్నారు. టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో తెలుగుతల్లి చిత్రపటానికి ప్రిన్సిపాల్‌ టి.గోవిందమ్మ, అధ్యాపకులు పూలమాల వేశారు. పాతపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.చక్రపతి మాట్లాడుతూ.. మాతృభాషతోనే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని చెప్పారు. ఇచ్ఛాపురం ముచ్చింద్ర ప్రాథమిక పాఠశాల ఆవరణలోని తెలుగుతల్లి విగ్రహానికి హెచ్‌ఎం కె.సుహ ష్‌చంద్‌, ఉపాధ్యాయులు పూలమాల వేశారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించి మాతృభాష విశిష్టతను తెలియజేశారు. పలాస సాయికాలనీ పా ఠశాలలో జనజాగృతి సాహితీ సంస్కృతి సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు శత కపద్య పోటీలు నిర్వ హించి విజేతలకు బహుమతులు అందించారు. మాతృ భాషను బతికించడంతోపాటు ఆంగ్ల భాషను కూడా నేర్చుకోవాలని శ్రీకాకు ళం ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కణితి శ్రీరాములు అన్నా రు. కళాశాల సమావేశమందిరంలో నిర్వహించిన మాతృభాష దినోత్సవం లో ఆయన మాట్లాడారు. తెలుగును బతికించడంలో సాహిత్యం గొప్ప పాత్ర పోషిస్తుందని తెలిపారు. నరసన్నపేట సత్యవరం ఉన్నత పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థినులు సంప్రదాయ వస్త్రధారణ చేశారు. పద్యాలు, బుర్రకథ, కవితల పోటీలను నిర్వహించారు. ప్రిన్సిపాల్‌ లత మాట్లాడుతూ.. మాతృభాషను చిన్నచూపు చూడవద్దని కోరారు. తెలుగు అధ్యాపకుడు రవికు మార్‌ తదితరులు పాల్గొన్నారు. జి.సిగడాం కేజీబీవీ, ఆదర్శ పాఠశాల, అధ్వా నంపేట, జి.సిగడాం, పెంట, తదితర పాఠశాలల్లో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థులు వివిధ వేషధారణలు, నృత్యాలను సందడి చేశారు. సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల అ అక్షర రూపంలో మానవహారం ఆకట్టుకుంది. హెచ్‌ఎం జానకిరామయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-21T23:57:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising