ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూలపేట భూసేకరణ అక్రమాలపై నిగ్గుతేల్చాలి

ABN, First Publish Date - 2023-06-03T00:35:59+05:30

మూలపేట గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టుకు సంబంధించి 409.77 ఎకరాలు, 594 పీడీఎఫ్‌లపై జరిగిన అక్రమాలపై నిగ్గు తేల్చాలని సర్పంచ్‌ బాబూరావుతో పాటు గ్రామ స్థులు కోరారు.

సబ్‌కలెక్టర్‌ రాహుల్‌కుమార్‌ రెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న మూలపేట రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- సబ్‌కలెక్టర్‌ రాహుల్‌కుమార్‌ రెడ్డికి రైతుల వినతి

టెక్కలి, జూన్‌ 2: మూలపేట గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టుకు సంబంధించి 409.77 ఎకరాలు, 594 పీడీఎఫ్‌లపై జరిగిన అక్రమాలపై నిగ్గు తేల్చాలని సర్పంచ్‌ బాబూరావుతో పాటు గ్రామ స్థులు కోరారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి సబ్‌కలెక్టర్‌ రాహుల్‌కుమార్‌ రెడ్డిని కలిసి విన తిపత్రం అందించారు. వీఆర్వో, తహసీల్దార్లు సూత్ర, పాత్రధారులుగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై విచారణ చేపట్టాలని రైతులు కోరారు. రైతుల వద్ద భూములు తీసుకున్నప్పుడు ఒక మాట.. ఇప్పుడు మరో మాట తగదని, తమ భూములు తిరిగి ఇచ్చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఎకరాకు రూ.25లక్షల చొప్పున పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించడంతో తాము అభివృద్ధి జరుగుతుందనే ఆశించా మని, అయితే అక్రమాలకు పాల్పడిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. భూములు, ఇళ్లకు కలిపి సుమారు రూ.6 కోట్ల మొత్తం స్థానికంగా లేనివారి పేర్లు నిర్వా సితుల జాబితాలో చేర్చారని. అందులో రూ.2కోట్లకు పైగా పరిహారాన్ని రెవెన్యూ అధికా రులు పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ చేయించాలని వారు కోరారు. సబ్‌ కలెక్టర్‌ స్పందిస్తూ.. ఈ వ్యవహారంపై పరిశీ లించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Updated Date - 2023-06-03T00:35:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising