ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రిగారూ.. మీరేమవుతారు?

ABN, First Publish Date - 2023-04-03T00:38:22+05:30

‘‘జిల్లాలో మంత్రుల వ్యవహారశైలి దారుణంగా ఉంది. మగవాళ్లందరూ పోరంబోకులైతే.. మరి మీరేమవుతారు’’ అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌.. రెవెన్యూమంత్రి ధర్మాన ప్రసాదరావును ప్రశ్నించారు.

మాట్లాడుతున్న కూన రవికుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

- సీదిరి.. నీ రాజకీయ అనుభవమెంత

- సంక్షేమం, అభివృద్ధిపై చర్చకు రావాలి

- టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ సవాల్‌

అరసవల్లి, ఏప్రిల్‌ 2: ‘‘జిల్లాలో మంత్రుల వ్యవహారశైలి దారుణంగా ఉంది. మగవాళ్లందరూ పోరంబోకులైతే.. మరి మీరేమవుతారు’’ అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌.. రెవెన్యూమంత్రి ధర్మాన ప్రసాదరావును ప్రశ్నించారు. ఆదివారం శ్రీకాకుళంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘‘తల్లికి కొడుకుగా, చెల్లెలికి అన్నగా, పిల్లలకు తండ్రిగా మగవాళ్లు ఎంతో బాఽధ్యతాయుతమైన పాత్రను పోషిస్తున్నారు. మరి ఆ తల్లులు, చెల్లెల్లు, బిడ్డలు మీ మాటలను ఎలా అర్థం చేసుకుంటారో మీకు తెలియదా?. పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజుకు ఉన్న రాజకీయ అనుభవమెంత?. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు మీకు ఈ ఏడాదిలో ఎన్ని పశువులు మరణించాయో తెలుసా?. ఎన్ని పశువులకు బీమా చెల్లించారో చెప్పగలరా?’’ అని రవికుమార్‌ నిలదీశారు. సంక్షేమం, అభివృద్ధి అంటూ తప్పుడు మాటలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అసలు టీడీపీ పుట్టిందే ప్రజా సంక్షేమం కోసం. పేదవారికి కిలో రెండు రూపాయలకే బియ్యం, ఉచి త విద్యుత్తు, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, ఉద్యోగాలలో 33శాతం రిజర్వేషన్లు, మహిళా పొదుపు సంఘాలను స్థాపించి దేశంలోనే మహిళా ఆర్థిక స్వావలంబనలో గొప్ప గుర్తింపును తెచ్చిన పార్టీ అని తెలిపారు. టీడీపీ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలకు ఇప్పుడు పేర్లు మార్చి.. చాలా వరకూ కోతలు విధిస్తున్నారని విమర్శించారు. ఒక్క విద్యారంగంలోనే 16 పథకాలను తీసేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రాష్ట్రం లో ప్రమాదవశాత్తు 1800 మంది చనిపోతే ఒక్క రూపాయి కూడా ఇవ్వని మీరు సంక్షేమం, అభివృద్ధి కోసం మాట్లాడ్డానికి సిగ్గుగా లేదా? అని ప్రశ్నిం చారు. మీకు దమ్ముంటే సంక్షేమం, అభివృదిఽ్ధపై బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు పీఎంజే బాబు, తోణంగి వెంకన్నయాదవ్‌, టీడీపీ రాష్ట్ర రైతు కార్యదర్శి సింతు సుధాకర్‌, ఐటీడీపీ అధ్యక్షుడు ప్రధాన విజయరాం, జంగమ సంఘం జిల్లా అధ్యక్షుడు విభూది సూరిబాబు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-03T00:38:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising