ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

క్యూఆర్‌ కోడ్‌తో వైద్య సేవలు

ABN, First Publish Date - 2023-06-26T23:23:37+05:30

ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌’లో భాగంగా రోగులకు వైద్యసేవలు మరింత వేగవంతంగా అందజేసేందుకు గాను చర్యలు చేపట్టారు. ఆసుపత్రికి వచ్చి ఓపీ తీసుకునే రోగికి ఉన్న అనారోగ్యాన్ని బట్టి సంబంధిత వైద్యుని వద్దకు జాప్యం లేకుండా ఉండేందుకు గాను క్యూర్‌ ఆర్‌ కోడ్‌ అమలు చేయనున్నారు. రోగికి సంబంధించిన ఆధార్‌ నెంబర్‌, మొబైల్‌ నెంబర్‌కు లింక్‌ ఉన్న వారు నేరుగా క్యూర్‌ ఆర్‌ కోడ్‌ సాయంతో వైద్య సేవలు పొందేందుకు అవకాశాలున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓపీ సమయంలోనే వివరాల నమోదు

టెక్కలి, జూన్‌ 26: ‘ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌’లో భాగంగా రోగులకు వైద్యసేవలు మరింత వేగవంతంగా అందజేసేందుకు గాను చర్యలు చేపట్టారు. ఆసుపత్రికి వచ్చి ఓపీ తీసుకునే రోగికి ఉన్న అనారోగ్యాన్ని బట్టి సంబంధిత వైద్యుని వద్దకు జాప్యం లేకుండా ఉండేందుకు గాను క్యూర్‌ ఆర్‌ కోడ్‌ అమలు చేయనున్నారు. రోగికి సంబంధించిన ఆధార్‌ నెంబర్‌, మొబైల్‌ నెంబర్‌కు లింక్‌ ఉన్న వారు నేరుగా క్యూర్‌ ఆర్‌ కోడ్‌ సాయంతో వైద్య సేవలు పొందేందుకు అవకాశాలున్నాయి. జిల్లాలోని జిల్లా కేంద్ర ఆసుపత్రి, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌, ప్రాంతీయ ఆసుపత్రుల్లో ఔట్‌పేషెంట్స్‌ రోగులకు క్యూఆర్‌ కోడ్‌ అమలు చేయను న్నారు. దీనికి సంబంధించి అవసరమైన క్యూఆర్‌ కోడ్‌ రూపొందించేదుకు గాను అవసరమైన సామగ్రి ఆసుపత్రులకు చేరుకున్నాయి. టెక్కలిలోని జిల్లా కేంద్ర ఆసుపత్రి, నరసన్నపేట ఏరియా ఆసుపత్రి, నరసన్నపేట, ఇచ్ఛాపురం, సోంపేట, బారువ, హరిపురం, పలాస, కోటబొమ్మాళి, బుడితి, పొందూరు, రణస్థలం, కొత్తూరు కమ్యూనిటీ హెల్త్‌సెంటర్లలో ఈ విధా నాన్ని అమలు చేయనున్నారు. ఇప్పటికే ఈ ఆసుప త్రుల్లో రోజుకు నాలుగు నుంచి ఐదు వేల మంది వరకు ఓపీ ఉంది. క్యూర్‌ఆర్‌కోడ్‌ వల్ల ఆయా రకాల వ్యాధులకు సంబం ధించి వైద్యులు ఇచ్చిన సూచనలు, మందులు వివరాలు కూడా అందులో నమోదవుతాయి. ఇంతవరకు బాగానే ఉన్నా క్యూఆర్‌ కోడ్‌ అమలుకు కేటాయించిన ఆసుపత్రులకు నెట్‌ సేవ లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు అవసరం ఉంది. ఈ విషయమై డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ జె. భాస్క రరావు వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా ప్రతి ఆసుపత్రిలో క్యూఆర్‌ కోడ్‌ అమలు చేయడం జరుగుతుందన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగుల వివరాలు నమోదు వల్ల త్వరితగతిన వైద్య సేవలు అందించేందుకు దోహదపడుతుందన్నారు.

Updated Date - 2023-06-26T23:23:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising