ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ రద్దుచేయాలి
ABN, First Publish Date - 2023-09-21T23:53:11+05:30
qqq
కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పేడాడ పరమేశ్వరరావు
టెక్కలి: ఎంబీబీఎస్ రెండో విడత కౌన్సెలింగ్ తక్షణమే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పేడాడ పరమేశ్వరరావు డిమాండ్‌చేశారు. తక్షణమే నిబం ధనల ప్రకారం తిరిగి కౌన్సెలింగ్ నిర్వహించాలని కోరారు. గురువారం టెక్కలి సబ్ కలెక్టర్ నూరుల్‌కుమార్‌కు వైఎస్‌ఆర్‌హెల్త్‌యూనివర్శిటీ అక్రమాలపై కాంగ్రెస్ నాయ కులతో కలిసివినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పరమేశ్వరరావు మాట్లాడు తూ వైఎస్‌ఆర్ హెల్త్ యూనివర్శిటీ అవినీతి, అక్రమాలకు నిలయంగా మారిందని ఆరోపించారు. రోస్టర్, రిజర్వేషన్ అమలులో లోపాలు ఉన్నాయని, ఎంబీబీఎస్ రెండో విడత కౌన్సెలింగ్‌లో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయని తెలిపారు. కార్య క్రమంలో కాంగ్రెస్‌పార్టీ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు కోత మధుసూదనరావు, పార్టీ టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జి చింతాడ దిలీప్, మహిళా కాంగ్రెస్ ప్రతినిధి టి.కవిత, పీవీఎస్ సరోజిని, దీర్ఘాసి వెంకట్రావు, డి.వెంకట్రావు, వినయ్‌కుమార్ పాల్గొన్నారు.
Updated Date - 2023-09-21T23:53:17+05:30 IST