ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లోకేష్‌ పాదయాత్రకు ప్రణాళిక తయారు చేయండి

ABN, First Publish Date - 2023-01-24T23:43:12+05:30

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయా త్రకు ప్రణాళికను తయారు చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ పేర్కొన్నారు. మంగళవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో పార్లమెంటరీ, అనుబంధ, సాధికారత కమిటీల అధ్యక్షులతో ఆయన సమావేశం నిర్వహించారు.

పార్టీ నాయకులతో రవికుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అరసవల్లి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయా త్రకు ప్రణాళికను తయారు చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ పేర్కొన్నారు. మంగళవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో పార్లమెంటరీ, అనుబంధ, సాధికారత కమిటీల అధ్యక్షులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భగా రవికుమార్‌ మాట్లాడుతూ.. ఫిబ్రవరి నెల నుంచి వచ్చే ఏడు నెలలకు కార్యక్రమ ప్రణాళికను తయారు చేయాలని సూచించారు. దీన్ని ఫిబ్రవరి 15వ తేదీలోగా జిల్లా కార్యాలయానికి పంపించాలని తెలిపారు. రెండవ దఫా ఓటరు జాబితా పరిశీలనను త్వరగా పూర్తి చేయాలని, జిల్లాలో ఉన్న సమస్యలపై అనుబంధ కమిటీలు, సాధికా రత కమిటీలు స్పందించి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. వీటన్నింటినీ పరిశీలించ డానికి ఒక ప్రతినిధిని నియమిస్తామన్నారు. ఫిబ్రవరి రెండో వారంలో రైతులకు మద్ద తుగా ధాన్యం బస్తాలు, ట్రాక్టర్లతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టాలని తీర్మా నించారు. కార్యక్రమంలో నాయకులు పీరుకట్ల విఠల్‌, పీఎంజే బాబు, చిట్టి మోహన్‌, బుక్కా యుగంధర్‌, దుమ్ము అశోక్‌, గోవింద పాపారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-24T23:43:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising