ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నిర్వహణ లేక.. సాగుకు నీరందక

ABN, First Publish Date - 2023-08-02T23:37:28+05:30

మండలంలోని బైరి కాలువకు అనుబంధంగా ఉన్న బూరవెల్లి పిల్లకాలువ సమర్థవంతంగా నిర్వ హించక పోవడంతో శివారు ఆయకట్టు కు ఖరీఫ్‌లో సైతం నీరందడం లేదు. ఈ కాలువ ద్వారా బూరవల్లి, అంబ ళ్లవలస, జోగిపంతులపేట గ్రామాల్లోని 500 ఎకరాలకు నీరందాల్సి ఉంది. సింగుపురం సమీపంలో బైరి మెయిన్‌ కాలువ నుంచి కింది ఆయకట్టుకు నీరందించేందుకు దశాబ్దాల కిందట పిల్లకాలువలు తవ్వారు. అయితే హైవే సమీపంలో దుకాణాల నిర్వాహకులు వ్యర్థాలు కాలువలో వేయడంతోపాటు పిచ్చిమొక్కలు, డొంకలు, తుప్పలు పెరిగి కాలువను కప్పేశాయి. దీంతో ముందుకు నీరు వెళ్లేందుకు ఆటంకం కలుగుతోంది. అయితే బూరవల్లికి మూడు కిలోమీటర్లు పరిధిలో ఉపాధి పథకం కింద పిల్ల కాలువలో మరమ్మతులు చేసినా బైరి హైవే జంక్షన్‌ నుంచి 300 మీటర్లు తప్పులు, డొంకలు తొలగించలేదు. ఈ ఏడాది ఇప్పటివరకూ ఆయకట్టుకు నీరందకపోవడంతో మళ్ల అబ్బాయినాయుడుతో పాటు రైతులు ఆందోళన చెందుతున్నారు. తక్షణమే జలవనరులశాఖ అధికారులు కాలువలో పిచ్చిమొక్కలు, తప్పులు తొలగించి శివారు ఆయకట్టుకు నీరందేలా చర్యలు తీసుకోవాలని వారంతా కోరుతున్నారు. కాగా తమ శాఖ దగ్గర నిధులు లేవని, ఉపాధి పథకం కింద కాలువలు మరమ్మతులచేయిస్తున్నామని జలవనరులశాఖ డీఈఈ అనీల్‌కుమార్‌ ఆంధ్రజ్యోతికి చెప్పారు.

బూరవెల్లి పిల్లకాలువలో పెరిగిన తుప్పలు, డొంకలు

గార: మండలంలోని బైరి కాలువకు అనుబంధంగా ఉన్న బూరవెల్లి పిల్లకాలువ సమర్థవంతంగా నిర్వ హించక పోవడంతో శివారు ఆయకట్టు కు ఖరీఫ్‌లో సైతం నీరందడం లేదు. ఈ కాలువ ద్వారా బూరవల్లి, అంబ ళ్లవలస, జోగిపంతులపేట గ్రామాల్లోని 500 ఎకరాలకు నీరందాల్సి ఉంది. సింగుపురం సమీపంలో బైరి మెయిన్‌ కాలువ నుంచి కింది ఆయకట్టుకు నీరందించేందుకు దశాబ్దాల కిందట పిల్లకాలువలు తవ్వారు. అయితే హైవే సమీపంలో దుకాణాల నిర్వాహకులు వ్యర్థాలు కాలువలో వేయడంతోపాటు పిచ్చిమొక్కలు, డొంకలు, తుప్పలు పెరిగి కాలువను కప్పేశాయి. దీంతో ముందుకు నీరు వెళ్లేందుకు ఆటంకం కలుగుతోంది. అయితే బూరవల్లికి మూడు కిలోమీటర్లు పరిధిలో ఉపాధి పథకం కింద పిల్ల కాలువలో మరమ్మతులు చేసినా బైరి హైవే జంక్షన్‌ నుంచి 300 మీటర్లు తప్పులు, డొంకలు తొలగించలేదు. ఈ ఏడాది ఇప్పటివరకూ ఆయకట్టుకు నీరందకపోవడంతో మళ్ల అబ్బాయినాయుడుతో పాటు రైతులు ఆందోళన చెందుతున్నారు. తక్షణమే జలవనరులశాఖ అధికారులు కాలువలో పిచ్చిమొక్కలు, తప్పులు తొలగించి శివారు ఆయకట్టుకు నీరందేలా చర్యలు తీసుకోవాలని వారంతా కోరుతున్నారు. కాగా తమ శాఖ దగ్గర నిధులు లేవని, ఉపాధి పథకం కింద కాలువలు మరమ్మతులచేయిస్తున్నామని జలవనరులశాఖ డీఈఈ అనీల్‌కుమార్‌ ఆంధ్రజ్యోతికి చెప్పారు.

Updated Date - 2023-08-02T23:37:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising