ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కుష్ఠువ్యాధిని నిర్మూలిద్దాం

ABN, First Publish Date - 2023-06-26T23:37:25+05:30

కుష్ఠువ్యాధిని పూర్తిగా నిర్మూలిం చడం సాధ్యమేనని, అందుకు అందరూ సహకరిం చాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ పిలుపునిచ్చారు.

పొగాకుతో కలిగే నష్టాలపై పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌

అరసవల్లి: కుష్ఠువ్యాధిని పూర్తిగా నిర్మూలిం చడం సాధ్యమేనని, అందుకు అందరూ సహకరిం చాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ పిలుపునిచ్చారు. సోమవారం జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా వైద్యా రోగ్యశాఖ ఆధ్వర్యంలో కుష్ఠువ్యాధి గుర్తింపులో భాగంగా ఇంటింటా సర్వే కార్యక్రమాన్ని ప్రారంభిం చారు. అదే విధంగా పొగాకు వల్ల కలిగే నష్టాలకు సంబంధించిన పోస్టర్‌ను జేసీ ఎం.నవీన్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడు తూ.. ఈనెల 26వ తేదీ నుంచి వచ్చే నెల 16వ తేదీ వరకు ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించనున్నట్టు, ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా అందరూ సహకరించాలని కోరారు. ప్రాథమిక దశలో గుర్తిస్తే, పూర్తిగా నివారణ సాధ్యమని తెలిపారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో అనూరాధ మాట్లాడుతూ.. ఈ సర్వే కోసం 2,380 టీములను ఏర్పాటు చేశామ ని చెప్పారు. శరీరంపై రాగి రంగు మచ్చ ఉంటే, నిర్లక్ష్యం చేయ కుండా వైద్య సహాయం తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అర్జీలు సకాలంలో పరిష్కరించాలి

అరసవల్లి: జగనన్నకు చెబుదాం, స్పందన అర్జీలను ఎలాంటి పెండింగ్‌ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందనలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 252 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మా ట్లాడుతూ.. స్పందన, ఏపీ సేవా, మీసేవా కింద అందిన అర్జీల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టా లని అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల వివరాలను శాఖల వారీగా సమీక్షించా రు. కార్యక్రమంలో జేసీ ఎం.నవీన్‌, డీఎస్‌వో వెంక టరమణ, డీపీవో రవికుమార్‌, డీఈవో తిరుమల చైతన్య, డిప్యూటీ డీఎంహెచ్‌వో అనూరాధ, ఉద్యాన శాఖ అధికారి ప్రసాదరావు తదతరులు పాల్గొన్నారు.

‘ప్రతిభ మీది.. ప్రోత్సాహం మాది’

అరసవల్లి: ప్రతిభ మీది.. ప్రోత్సాహం మాది అంటూ కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ అన్నారు. సోమవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ఆయన యువజనోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. యువతలోని ప్రతిభను ప్రోత్సహించేందుకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్రం, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల సంయుక్తంగా ఈ నెల 28న యువ ఉత్సవ్‌ను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. భారతదేశం 2047 అనే థీమ్‌తో సృజనాత్మక రచన, కవిత్వం, చిత్రలేఖనం, మొబైల్‌ ఫొటోగ్రఫీ, ఉపన్యాసం, సాంస్కృతిక/జానపద కళలు వంటి అంశాలపై యువ ఉత్సవ్‌ నిర్వహించనున్నట్టు చెప్పారు. ఎన్‌వైకే యూత్‌ కోఆర్డినేటర్‌ ఉజ్వల్‌ మాట్లాడుతూ... పైన తెలిపిన విభాగాల్లో ప్రతిభ చూపినవారికి బహుమతి, నగదు, ధ్రువపత్రాలు అందజేయడమే కాకుండా, ప్రతిభావంతులకు జాతీయ స్థాయి ఉత్సవ్‌లో పాల్గొనే అవకాశం కల్పిస్తామన్నారు. ఆసక్తి గల 15 నుంచి 29 ఏళ్ల వయస్సు లోపు యువతీ, యువకులు తమ వివరాలు రిజిస్ట్రేషన్‌ చేయించుకుని పోటీల్లో పాల్గొనాలని తెలిపారు. ఇతర వివరాలకు శ్రీకాకుళంలోని నెహ్రూ యువకేంద్రం కార్యాయలంలో గాని, 9492118960 ఫోన్‌ నెంబరులో గాని సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేసీ ఎం.నవీన్‌, ఇన్‌చార్జి డీఆర్వో మురళీకృష్ణ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T23:37:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising