ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ హయాంలోనే పేదలకు న్యాయం

ABN, First Publish Date - 2023-04-03T23:45:04+05:30

టీడీపీ హయాంలోనే పేదలకు న్యాయం జరిగేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. సోమవారం కోటబొమ్మాళి మండలం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో టెక్కలి మేజర్‌పంచాయతీకి చెందిన 50 రజక కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలో చేరాయి.

అచ్చెన్న సమక్షంలో టీడీపీలో చేరిన రజకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

టెక్కలి/కోటబొమ్మాళి, ఏప్రిల్‌ 3: టీడీపీ హయాంలోనే పేదలకు న్యాయం జరిగేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. సోమవారం కోటబొమ్మాళి మండలం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో టెక్కలి మేజర్‌పంచాయతీకి చెందిన 50 రజక కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలో చేరాయి. వీరికి అచ్చెన్నాయుడు.. పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలకు మోసం చేసిందని, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయని, సామాన్యుడు బతుకు భారమైందన్నారు. బస్సు చార్జీలు, విద్యుత్‌ చార్జీలు, పెట్రోల్‌ ధరలు పెంచి సామాన్యుడిపై భారం మోపిందని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి.. వైసీపీకి బుద్ధి చెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రజక సంఘ నాయకులు బొమ్మాళి హరి, జగన్నాథం, అప్పారావు, జ్యోతి, మీన, సూరిబాబు, రామారావు, శివ, యశోధ, కృష్ణ, నగేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-03T23:45:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising