జీడి బోర్డు ఏర్పాటు చేయాలి
ABN, First Publish Date - 2023-08-02T23:43:05+05:30
రాష్ట్రంలో జీడికార్పొరేషన్, జీడిబోర్డు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం జిల్లా కార్యదర్శి మోహనరావు డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని మాకన్నపల్లిలో ఇటీవల ఆత్మహత్యకు పాల్ప డిన జీడిరైతు సైని సింహాచలం సంతాపసభ నిర్వహించారు. ఈ సందర్భంగా మోహనరావు మాట్లాడుతూ జీడిపిక్కల ధర పతనంకావడంతో రుణాలను రైతులు తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నారని తెలిపారు. రైతు సింహాచలం కుటుంబానికి రూ.20లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలోసర్పంచ్ సైని దేశయ్య, సీఐటీయూ నాయకులు గణపతి, టి.అజయ్ కుమార్, పీవోడబ్ల్యూ నాయకురాలు హైమవతి, కె.వినోద్‌కుమార్, సాతుపల్లి కృష్ణారావు, దుర్యోధన, అప్పలస్వామి పాల్గొన్నారు.
పలాస రూరల్: రాష్ట్రంలో జీడికార్పొరేషన్, జీడిబోర్డు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం జిల్లా కార్యదర్శి మోహనరావు డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని మాకన్నపల్లిలో ఇటీవల ఆత్మహత్యకు పాల్ప డిన జీడిరైతు సైని సింహాచలం సంతాపసభ నిర్వహించారు. ఈ సందర్భంగా మోహనరావు మాట్లాడుతూ జీడిపిక్కల ధర పతనంకావడంతో రుణాలను రైతులు తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నారని తెలిపారు. రైతు సింహాచలం కుటుంబానికి రూ.20లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలోసర్పంచ్ సైని దేశయ్య, సీఐటీయూ నాయకులు గణపతి, టి.అజయ్ కుమార్, పీవోడబ్ల్యూ నాయకురాలు హైమవతి, కె.వినోద్‌కుమార్, సాతుపల్లి కృష్ణారావు, దుర్యోధన, అప్పలస్వామి పాల్గొన్నారు.
Updated Date - 2023-08-02T23:43:05+05:30 IST