ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జై చెవిటమ్మ తల్లీ

ABN, First Publish Date - 2023-05-02T00:04:13+05:30

సారవకోట మండలం కిన్నెరవాడలో మంగళవారం చెవిటమ్మతల్లి సిరిమానోత్సవం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం జలుమూరు మండలం కొమనాపల్లి పంచాయతీ కత్తిరివానిపేటలో సిరిమాను చెట్టుకు గ్రామస్థులు పూజలు చేశారు.

కత్తిరివానిపేట నుంచి సిరిమాను మోసుకెళ్తున్న కిన్నెరవాడ గ్రామస్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కిన్నెరవాడలో నేడు సిరిమానోత్సవం

సారవకోట (జలుమూరు), మే 1: సారవకోట మండలం కిన్నెరవాడలో మంగళవారం చెవిటమ్మతల్లి సిరిమానోత్సవం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం జలుమూరు మండలం కొమనాపల్లి పంచాయతీ కత్తిరివానిపేటలో సిరిమాను చెట్టుకు గ్రామస్థులు పూజలు చేశారు. అనంతరం 40 అడుగుల పొడవు గల సిరిమానును పది కిలోమీటర్ల దూరం మోసుకెళ్లారు. మంగళ వాయిద్యాలతో బుడితి, అవలింగి, చీడిపూడి గ్రామాల మీదుగా కిన్నెరవాడ గ్రామానికి తరలించారు. మంగళవారం మెండ దాలెప్పన్న సిరిమానును అధిరోహించనున్నారు. సిరిమాను ఊరేగింపులో కాళీమాత వేషధారణలు, బిందెల నృత్యంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర బీసీ కమిటీ అధికార ప్రతినిధి ధర్మాన తేజకుమార్‌ ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ, తాగునీటిని అందజేశారు.

Updated Date - 2023-05-02T00:04:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising