ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సొంత పార్టీలోనే జగన్‌కు ముసలం

ABN, First Publish Date - 2023-03-24T00:23:53+05:30

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి సొంతపార్టీలోనే ముసలం ప్రారంభమైందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు అన్నారు.

టెక్కలిలో బాణసంచా కాల్చుతూ.. టీడీపీ నేతల సంబరాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

- టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు

- ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా టీడీపీ అభ్యర్థి గెలుపు

- జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణుల సంబరాలు

ఎచ్చెర్ల, మార్చి 23: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి సొంతపార్టీలోనే ముసలం ప్రారంభమైందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు అన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్యే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనూరాధ విజయం సాధించడంపై ఆయన హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో గురువారం సాయంత్రం మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు, ఎమ్మెల్యే కోటాలో ఒక ఎమ్మెల్సీని టీడీపీ కైవసం చేసుకోవడం పార్టీ అధినేత చంద్రబాబు చాణుక్యతే కారణమన్నారు. 2024లో జరిగే సాధారణ ఎన్నికలే వైసీపీకి చివరివని జోస్యం చెప్పారు. జగన్‌ పాలన పట్ల ప్రజలు పూర్తిగా విసుగుచెందారని, రానున్న ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయమన్నారు. సంక్షేమం, అభివృద్ధితో జనరంజకమైన పాలన అందించే సత్తా టీడీపీకే ఉందన్నారు. వైసీపీ పాలనలో వ్యక్తిగత దాడులు, అక్రమ కేసులు తప్ప సాధించేదేమీ లేదన్నారు.

- సారవకోట (జలుమూరు): ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన పంచుమర్తి అనూరాధ అనూహ్యరీతిలో విజయం సాధించడంపై నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సారవకోట మండలం సవరడ్డపనస టీడీపీ కార్యాలయంలో గురువారం రాత్రి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. పార్టీ రాష్ట్ర బీసీ కమిటీ అధికార ప్రతినిధి ధర్మాన తేజకుమార్‌, పార్టీ మండల అధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ, నాయకులు సురవరపు తిరుపతిరావు, పట్ట ఉమామహేశ్వరరావు, ఇస్సై నాగరాజు, కోన వేంకటేష్‌, తాడేల భీమారావు తదితరులు పాల్గొన్నారు.

- నరసన్నపేట: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని అనురాధ గెలిపొందడంపై ఆ పార్టీ నరసన్నపేట కార్యాలయంలో గురువారం రాత్రి నాయకులు, కా ర్యకర్తలు సందడి చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరంభంచిన విజయయాత్రను 2024లో జరిగే సాధారణ ఎన్నికల వరకు కొనసాగుతుందని టీడీపీ నాయకులు అన్నా రు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు శిమ్మ చంద్రశేఖర్‌, పార్టీ పట్టణ అధ్యక్షుడు కింజరాపు రామారావు, లీగల్‌ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి రోణంకి కృష్ణంనాయుడు, నాయకులు బోయన సతీష్‌, రెడ్డి సతీష్‌, కోరాడ రామచంద్రరావు, సరి యపల్లి మధు తదితరులు పాల్గొన్నారు.

- టెక్కలి: ఎమ్మెల్యీల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తరుపున పంచుమర్తి అనూరాధ గెలుపొందడంపై గురువారం రాత్రి స్థానిక అంబేడ్కర్‌ కూడలిలో ఆ పార్టీ నయకులు బాణసంచా కాల్చి సంబరాలు చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మామిడి రాము, పోలాకి చంద్రశేఖర్‌, కోళ్ల కామేసు, రెయ్యి ప్రీతీష్‌, బెహరా కాళి, ప్రసాద్‌రెడ్డి, మధు, చిన్నమనాయుడు, రాంప్రసాద్‌, ముడిదాన ఆనందకుమార్‌, శ్రీరాములు, యర్రబ్బాయి తదితరులు ఉన్నారు.

- పలాస: స్థానిక టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీగా పంచుమర్తి అనురాధ ఎంపికపై హర్షం వ్యక్తం చేస్తు గురువారం రాత్రి కార్యకర్తలు, నాయకులు విజయోత్సవ వేడుక లు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌చేసి సందడి చేశారు. కార్యక్రమలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబూరావు, జిల్లా కార్యదర్శి పీరుకట్ల విఠల్‌రావు, రాష్ట్ర బీసీసెల్‌ కార్యదర్శి లొడగల కామేశ్వరరావు యాదవ్‌ పాల్గొన్నారు.

- వజ్రపుకొత్తూరు: ఎమ్మెల్యే కోటా నుంచి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచమర్తి అనురాధ గెలుపొందడంపై టీడీపీ నాయకులు గురువారం రాత్రి మిఠాయిలు పంచుకోని సంబరాలు చేసుకున్నారు. ప్రజలలో మార్పు మొదలైందని ఆ పార్టీ నాయకులు పుచ్చ ఈశ్వరరావు, కర్ని రమణ అన్నారు.

- పాతపట్నం: సమష్టి కృషితోనే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అనూరాధ విజయవం సా ధించినట్టు మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణమూర్తి అన్నారు. అనురాధ విజయవంపై గురువారం రాత్రి పార్టీ శ్రేణులతో సంబరాలు జరుపుకున్నారు. బాణ సంచా కాల్చి, స్వీట్స్‌ పంచుకుని సందడి చేశారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కలమట సాగర్‌, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- హిరమండలం: వైసీసీ ప్రభుత్వం పతనం మొదలైందని ఇక దీన్ని ఎవరూ అడ్డుకోలేరని హిరమండలం జడ్పీటీసీ పి.బుచ్చిబాబు అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన షాక్‌ నుంచి వైసీపీ తేరుకోకముందే మరోసారి ఆ పార్టీకి పెద్ద షాక్‌ తగిలిందన్నారు గురువారం జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్థి ఓటమికి దేవుడి రాసిన స్ర్కిప్ట్‌లో భాగమేనన్నారు. 23వ తేదీన 23 ఓట్లతో వైసీపీ అభ్యర్థి ఓపోయారన్నారు. ఈ సం దర్భంగా కేక్‌కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు చరణ్‌, జి.కామేశ్వరరావు, కె.సింహా చలం, వెంకటరమణ, తేజ, నారాయణరావు పాల్గొన్నారు.

- గార: ఎమ్మెల్సీగా పంచుమర్తి అనూరాధ విజయం సాధించడంపై జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు గొండు శంకర్‌, టీడీపీ నాయకులు పీస వెంకటరమణ మూర్తి, బడగల వెంకట అప్పారావు, గుండ భాస్కరరావు, జి.వి.రమణమూర్తి, కె.ఆదినారాయణ, మైగాపు ప్రభాకరరావు హర్షం వ్యక్తం చేశారు.

- రణస్థలం: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పి.అనూరాధ 23 ఓట్లతో గెలుపొందడంపై పొందూరు మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ కలిశెట్టి అప్పల నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం రాత్రి కేక్‌ కట్‌ చేశారు.

Updated Date - 2023-03-24T00:23:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising