ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జీడిపిక్కల దిగుమతి నిలిపివేయాలి

ABN, First Publish Date - 2023-09-21T23:55:14+05:30

విదేశీజీడి పిక్కలను దిగుమతి తక్షణమే నిలిపి వేసి, రైతులకు న్యాయం చేయాలని సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి వంకల మాధవరావు డిమాం డ్‌చేశారు.

పలాస: విదేశీజీడి పిక్కలను దిగుమతి తక్షణమే నిలిపి వేసి, రైతులకు న్యాయం చేయాలని సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి వంకల మాధవరావు డిమాం డ్‌చేశారు.గురువారం పలాసలోని ఆ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మా ట్లాడుతూ దశాబ్దాలుగా ఉద్దానంప్రాంతంలోని గ్రామాల్లో జీడి రైతులు దగా పడుతు న్నారని తెలిపారు. జీడిపంటే జీవనాధారంగా ఉన్న రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదని, ఇంత వరకూ జీడిరైతుల కోసం ప్రభుత్వం ఒక పాలసీఅంటూ రూపొందించ లేదని చెప్పారు. వ్యాపారుల దయాదాక్షిణ్యాలతోనే రైతులు ప్రతి ఏటా ఆధారపడాల్సి వస్తోందని తెలిపారు. కేరళలో ప్రోత్సహిస్తున్న విధంగానే రాష్ట్రంలో కూడా రైతులకు ఆదుకోవాలని డిమాండ్‌చేశారు.విదేశీ జీడిపిక్కల దిగుమతి వల్ల స్వదేశీజీడి పిక్కలకు గిట్టుబాటు ధర అందడం లేదని తెలిపారు. రైతుల పంటలను నిల్వ ఉంచడానికి మార్కెటింగ్‌ గిడ్డంగులు కూడా నిర్మించలేదని ఆరోపించారు. తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి స్వదేశీ జీడి పిక్కలను ప్రోత్సహించి విదేశీ పిక్కలకు అడ్డుకట్టు వేయాలని కోరారు. సమావేశంలో ఆ పార్టీ నాయకులు వీరాస్వామి, కూర్మారావు, సోమేశ్వరరా వు, బంగ్లాకుమార్‌, సరస్వతి, వినోద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-09-21T23:55:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising