ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చంద్రబాబుపై అక్రమ కేసులు

ABN, First Publish Date - 2023-09-22T00:02:22+05:30

టీడీపీ అధినేత చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించారని తెలుగు శక్తి రాష్ట్ర అధ్యక్షుడు బీవీ రామ్‌ విమర్శించారు.

మాట్లాడుతున్న తెలుగు శక్తి రాష్ట్ర అధ్యక్షుడు బీవీ రామ్‌

- తెలుగు శక్తి రాష్ట్ర అధ్యక్షుడు బీవీ రామ్‌

అరసవల్లి, సెప్టెంబరు 21: టీడీపీ అధినేత చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించారని తెలుగు శక్తి రాష్ట్ర అధ్యక్షుడు బీవీ రామ్‌ విమర్శించారు. శ్రీకాకుళంలోని ఓ హోటల్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌కు అభివృద్ధి చేయడం చేతకాదన్నారు. చంద్రబాబును అరెస్టు చేశాక సాక్ష్యాల కోసం ప్రయత్నిస్తున్నామని పోలీసులు అన్నారంటే.. ఈ అరెస్టు ఎంత అక్రమమో అర్థమవుతుందన్నారు. ఏపీ పోలీసు, సీఐడీ వైసీపీ పాలకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సుప్రీం కోర్టులో కేసు నడుస్తుంటే విశాఖ రాజధానిగా పరిపాలన సాగిస్తామని అనడం హాస్యాస్పదమన్నారు. 21 ఏళ్ల పాటు ఎన్టీఆర్‌, చంద్రబాబు ముఖ్యమంత్రులుగా పని చేశారని, వారి హయాంలో ఎక్కడా అవినీతి జరగలేదని అన్నారు. తెలుగుజాతి గౌరవం కోసం ముక్తకంఠంతో చంద్రబాబు అరెస్టును ఖండించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మద్యం ద్వారా వచ్చిన ఆదాయం ఎక్కడికి పోతోందని ప్రశ్నించారు. డిజిటల్‌ లావాదేవీలు చేయాలని ప్రధాని ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంటే.. మన రాష్ట్రంలో మాత్రం మద్యం అమ్మకాలు నగదు రూపంలో చేస్తున్నారని అన్నారు.

Updated Date - 2023-09-22T00:02:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising