25 నుంచి ఐఎఫ్‌టీయూ రాష్ట్ర మహాసభలు
ABN, First Publish Date - 2023-02-21T23:48:24+05:30
శ్రీకాకుళంలో ఈనెల 25, 26 తేదీల్లో నిర్వహించనున్న ఐఎఫ్‌టీయూ 9వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని మహాసభల నిర్వహణ కమిటీ కార్యదర్శి, ఐఎఫ్‌టీయూ కార్యవర్గ సభ్యులు నేతింటి నీలంరాజు, సింగూరు బాబూరావు కోరారు. జలుమూరులో మంగళవారం భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు.
జలుమూరు: శ్రీకాకుళంలో ఈనెల 25, 26 తేదీల్లో నిర్వహించనున్న ఐఎఫ్‌టీయూ 9వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని మహాసభల నిర్వహణ కమిటీ కార్యదర్శి, ఐఎఫ్‌టీయూ కార్యవర్గ సభ్యులు నేతింటి నీలంరాజు, సింగూరు బాబూరావు కోరారు. జలుమూరులో మంగళవారం భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టపరంగా ఉన్న కార్మిక హక్కులను కాలరాస్తున్నాయని విమర్శించారు. 44 కార్మిక చట్టాలను, 4 లేబర్ కోడులుగా తీసుకొచ్చి కార్పొరేట్ సంస్థలకు దాసోహమై కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. కార్యక్రమంలో పల్లి ఈశ్వరరావు, మెట్ట మన్మథరావు, కూన సోమేశ్వరరావు, నక్క లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-02-21T23:48:25+05:30 IST