ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైవేపై బ్లాక్‌స్పాట్‌లను గుర్తించండి

ABN, First Publish Date - 2023-06-07T23:39:18+05:30

హైవేపై తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్‌స్పాట్‌లుగా గుర్తించాలని సబ్‌ కలెక్టర్‌ టి. రాహుల్‌ కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం పోలీస్‌, ఆర్టీవో, డీపీవో, పోలీస్‌, మెడికల్‌, ఆర్‌అండ్‌బీ, ఎలక్ట్రికల్‌, పంచాయతీ రాజ్‌ శాఖలతో రోడ్డు భద్రతపై తన కార్యాల యంలో సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ విషయంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.

టెక్కలి: వివిధ శాఖల అధికారులతో మాట్లాడుతున్న సబ్‌ కలెక్టర్‌ రాహుల్‌కుమార్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సబ్‌ కలెక్టర్‌ రాహుల్‌ కుమార్‌ రెడ్డి

టెక్కలి, జూన్‌ 7: హైవేపై తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్‌స్పాట్‌లుగా గుర్తించాలని సబ్‌ కలెక్టర్‌ టి. రాహుల్‌ కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం పోలీస్‌, ఆర్టీవో, డీపీవో, పోలీస్‌, మెడికల్‌, ఆర్‌అండ్‌బీ, ఎలక్ట్రికల్‌, పంచాయతీ రాజ్‌ శాఖలతో రోడ్డు భద్రతపై తన కార్యాల యంలో సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ విషయంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. రోడ్లకు అడ్డంగా మార్గాలు ఏర్పాటు చేయ డం వల్ల ప్రమాదాల సంఖ్య పెరుగుతోందన్నారు. ప్రమాద ప్రాంతాల్లో బోర్డులు, రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయాలని, అవసరమైతే ఎన్‌హెచ్‌ఏఐ అధికారుల దృష్టికి తీసుకువెళ్లా లన్నారు. ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఆ యా శాఖలపై ఉందని, నివారణ చర్యలు చేప ట్టాలన్నారు. ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్లు ధరించేలా చర్యలు తీసు కోవాలన్నారు. ప్రయాణికులను తీసుకొని వెళ్లే వాహనాలకు ఫిట్‌నెస్‌ తప్పనిసరని, వాహనాలకు సీ బుక్‌లు, బీమా ఉండాలని, డ్రైవర్లు డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి వుండాలని.. ఇవేవీ లేకుండా వాహనాలు నడిపితే ప్రమాదాలు తప్పవన్నారు. ప్రమాద రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దాలన్నారు. సమావేశం లో డీఎస్పీ బాల చంద్రారెడ్డి, ఎంవీఐ సంజీవరావు, పీఆర్‌ ఈఈ సురేష్‌కుమార్‌, ఆర్‌అండ్‌బీ ఈఈ సత్యనారాయణ, ట్రాన్స్‌కో ఈఈ రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి

సంతబొమ్మాళి: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని టెక్కలి సబ్‌ కలెక్టర్‌ రాహుల్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. బుధవారం భావనపాడు సముద్ర తీరంలో పర్యా వరణ పరిరక్షణపై గ్రామస్థులకు అవగాహన కలిగించారు. సముద్ర తీరానికి వచ్చే సందర్శకులు ప్లాస్టిక్‌ తదిత ర వస్తు వులు సముద్రంలో పడేయకుండా గ్రామస్థులు, విద్యార్థులు వారిని చైతన్యం చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రేమలీల, సర్పంచ్‌ బుడ్డా మోహన్‌రెడ్డి, ఎంపీటీసీ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-07T23:39:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising