వర్షం పడితే నరకమే
ABN, First Publish Date - 2023-06-26T00:08:52+05:30
శ్రీకాకుళం రూరల్ మండలం, ఆమదాలవలస మునిసిపాలిటీలోని 7వ వార్డు చింతాడలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉం ది.
- చింతాడలో డ్రైనేజీ అస్తవ్యస్తం
- వీధుల్లో నిలిచిపోతున్న మురుగు
- ప్రజలు తీవ్ర ఇబ్బందులు
అరసవల్లి, జూన్ 25: శ్రీకాకుళం రూరల్ మండలం, ఆమదాలవలస మునిసిపాలిటీలోని 7వ వార్డు చింతాడలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉం ది. సక్రమంగా కాలువలు లేకపోవడంతో వీధుల్లోనే మురుగు నిలిచిపోతుంది. చిన్న వర్షానికే వీధులు చె రువులను తలపిస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇ బ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గ్రామంలోని ఎస్సీ కాలనీ, మజానగరం, చింతాడ కాలనీ, నాయు డువారి వీధి, పొదిలాపువారి వీధుల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. గమలపేటలో అయితే మరీ దారు ణం. దశాబ్దాలుగా వీరు మురుగులోనే మగ్గుతున్నా రు. కళింగపట్నం-చింతాడ రోడ్డుని నిర్మించి ఇరు వైపులా కాలువలను ఏర్పాటు చేయలేదు. పైగా ఈ రోడ్డు గ్రామంలోని వీధుల కంటే ఎత్తుగా ఉంది. దీని వల్ల వర్షానికి వీధుల్లో మోకాళ్ల లోతులో నీరు నిలి చిపోతుంది. అలాగే, ఆమదాలవలస-శ్రీకాకుళం రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఈ గ్రామం వద్ద కానా ను తవ్వేసి వదిలేశారు. దీనివల్ల వర్షపు నీరు, మురుగు వెళ్లేందుకు అవకాశం లేకుండా పోతుంది. ఈ గ్రామం ఒకపక్క శ్రీకాకుళం రూరల్ మండలం, మ రోపక్క ఆమదాలవల స మునిసిపాలిటీ పరి ధిలో ఉండడంతో సమ స్యలు ఎవరికి చెప్పుకో వాలో తెలియడం లేద ని ప్రజలు వాపోతు న్నారు. ఎన్ని ప్రభుత్వా లు మారినా అభివృద్ధి జరగడం లేదన్నారు. స్థానిక నాయకులు, అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మురుగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
Updated Date - 2023-06-26T00:09:06+05:30 IST