ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థులకు వేధింపులు

ABN, First Publish Date - 2023-04-03T23:47:27+05:30

మండల పరిధి డి.బొండపల్లి ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు తురక బలరాం, రికార్డు అసిస్టెంట్‌ మధుసూదన్‌ విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ, అసభ్యకర పదజాలంతో వేధిస్తున్నారంటూ తల్లిదండ్రులు సోమవారం పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు.

ఇరువర్గాలతో మాట్లాడుతున్న ఎస్‌ఐ రామారావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

- హెచ్‌ఎం, రికార్డు అసిస్టెంట్‌ తీరుపై మండిపాటు

- పాఠశాల వద్ద తల్లిదండ్రుల ఆందోళన

జి.సిగడాం: మండల పరిధి డి.బొండపల్లి ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు తురక బలరాం, రికార్డు అసిస్టెంట్‌ మధుసూదన్‌ విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ, అసభ్యకర పదజాలంతో వేధిస్తున్నారంటూ తల్లిదండ్రులు సోమవారం పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. వారి వివరాల మేరకు.. గతంలో కూడా రికార్డు అసిస్టెంట్‌ మధు సూదన్‌ విద్యార్థులను వేధించేవారిని, దీనిపై అప్పట్లో నిరసన తెలిపినట్టు గ్రామస్థులు తెలిపారు. ఇంకెప్పు డూ ఇలా జరగదని హామీ ఇవ్వడంతో అప్పటికి ఆ వివాదం సద్దుమణిగింది. మళ్లీ అదే పరిస్థితి కొన్నాళ్ల గా ఎదురవుతున్నా విద్యార్థులను బెదిరిస్తూ గుట్టు చప్పుడు కాకుండా చూసుకున్నారు. ఇది తీవ్రస్థాయికి చేరుకోవడంతో సోమవారం విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, యువకులు పాఠశాల వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. హెచ్‌ఎం, గుమస్తా డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. మా పాఠశాల లో పనిచేయొద్దని, పాఠశాలను విడిచి వెళ్లిపోవాలని నినాదాలు చేశారు. సచివాలయ మహిళా పోలీసు ఇచ్చిన సమాచా రం మేరకు ఎస్‌ఐ సామంతుల రామారావు సిబ్బందితో పాటు పాఠశాల వద్దకు చేరుకొని ఇరువురికి సర్దిచెప్పారు. విద్యార్థుల ను వేధిస్తున్న హెచ్‌ఎం, రికార్డు అసిస్టెంట్స్‌ మాకొద్దంటూ నినాదాలు చేశారు. వీరిద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీనిపై ఎస్‌ఐ రామారావు మాట్లాడుతూ.. ఆ గ్రామ మహిళా పోలీసు, ప్రజాప్రతినిధి ద్వారా సమాచారం తెలుసుకుని గ్రామానికి వెళ్లినట్టు తెలిపారు. అనంతరం వివాదం పెద్దది కాకుండా ఇరువర్గాలతో మాడ్లాడి సమస్య సద్దుమణిగేలా కృషి చేసినట్టు తెలిపారు.

Updated Date - 2023-04-03T23:47:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising