పాక్ చెర నుంచి మత్స్యకారుడి విడుదల
ABN, First Publish Date - 2023-05-15T00:10:22+05:30
మండలంలోని బడివానిపేట పంచాయతీ జాలరీకొయ్యాం గ్రామానికి చెందిన మైలపల్లి భాస్కరరావు(41) పాక్ చెర నుంచి విడుదల య్యాడు.
ఎచ్చెర్ల: మండలంలోని బడివానిపేట పంచాయతీ జాలరీకొయ్యాం గ్రామానికి చెందిన మైలపల్లి భాస్కరరావు(41) పాక్ చెర నుంచి విడుదల య్యాడు. సుమారు ఆరేళ్ల పాటు అక్కడి జైలులో శిక్ష అనుభవించాడు. భాస్క రరావు ఆరేళ్ల క్రితం చేపల వేటకు గుజరాత్ రాష్ట్రం వీరావల్‌కు వెళ్లాడు. సముద్రంలో వేట సాగిస్తుండగా పాక్ కోస్ట్ గార్డులకు బంధిగా చిక్కాడు. అప్పటి నుంచి జైలులో మగ్గిపోయాడు. అతన్ని విడుదల చేయడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - 2023-05-15T00:10:22+05:30 IST