ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్లాక్‌ టవర్ల ఏర్పాటుకు స్థల పరిశీలన చేయండి

ABN, First Publish Date - 2023-03-16T00:05:23+05:30

తీరప్రాంతంలో క్లాక్‌ టవర్ల ఏర్పాటుకు స్థల పరిశీలన చేయాలని సబంధిత అధికారులను కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

- కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌

అరసవల్లి: తీరప్రాంతంలో క్లాక్‌ టవర్ల ఏర్పాటుకు స్థల పరిశీలన చేయాలని సబంధిత అధికారులను కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ ఆదేశించారు. బుధవారం జిల్లాస్థాయి తీరప్రాంత భద్రతా కమిటీ సమావేశం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. మంచినీళ్లపేట, రాజారాంపురం, మొగదలపాడు, పీజీ పేట, ఇందువానిపేట, బారువ, కొత్తఊరు తదితర ప్రాంతాల్లో క్లాక్‌ టవర్లను ఏర్పాటు చేయనున్నామని, అధికారులు తహల్దార్లతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అదే విధంగా ప్రమాద స్థలాల వద్ద హెచ్చరిక బోర్డుల విషయమై వివరాలను తెలియజేయాలని సూచించారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు సంబంధిత శాఖ జారీచేసే బయోమెట్రిక్‌, ఆధార్‌ కార్డులు తీసుకు వెళ్లాలని, లేకుంటే వారినుంచి సాఽధారణ రుసుంను వసూలు చేయాలని సూచిం చారు. 11 మండలాల్లో మత్స్యశాఖ గుర్తింపు పొందని బోట్లు 43 ఉన్నాయని, వాటిని రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలన్నారు. చేపల వేటకు చిన్నపిల్లలను తీసుకువెళ్లకుండా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్పీ జీఆర్‌ రాధిక, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అధికారి పి.రాము, ఇండి యన్‌ కోస్టు గార్డు అధికారి ఎస్‌ఎం భాషా, కోస్టల్‌ సెక్యూరిటీ ఏఎస్పీ జీబీఆర్‌ మధుసూదనరావు, మెరైన్‌ డీఎస్పీ ఆర్‌.గోవిందరావు, ఐబీ జేడీడీ కె.గణేషన్‌, డీసీఐవో పీకే మహాపాత్ర, మత్స్యశాఖ ఏడీ పీవీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-16T00:05:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising