ఢిల్లీ దర్శన్‌కు జిల్లా విద్యార్థినులు
ABN, First Publish Date - 2023-08-02T00:00:47+05:30
జిల్లాకు చెందిన నలుగురు విద్యార్థినులు ‘ఢిల్లీ దర్శన్’ కార్యక్రమంలో భాగంగా లోక్‌సభను సందర్శించారు.
శ్రీకాకుళం, జూలై 1(ఆంధ్రజ్యోతి): జిల్లాకు చెందిన నలుగురు విద్యార్థినులు ‘ఢిల్లీ దర్శన్’ కార్యక్రమంలో భాగంగా లోక్‌సభను సందర్శించారు. శ్రీకాకుళం మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థిని ఉప్పాడ రేష్మ, ఎన్‌ఎస్‌ఎస్ జాతీయస్థాయి శిబిరానికి ప్రాతినిధ్యం వహించిన అంబేడ్కర్ వర్సిటీ విద్యార్థిని బమ్మిడి రంజని, వమరవల్లి డైట్ విద్యార్థిని ఎన్.పవిత్రప్రియ, పాతపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని ముళ్ల సంధ్యారాణి ఢిల్లీ దర్శన్‌కు ఎంపికయ్యారు. వీళ్లు పార్లమెంట్‌ను సందర్శించగానే ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు లోక్‌సభ విశిష్టత, చట్టస భల్లో ప్రజాప్రతినిధుల పనితీరు, వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రధాన గ్రంథాలయం తదితర అంశాలు వివరించారు. అలాగే సినీనటి, ఎంపీ నవనీత్‌కౌర్‌తోపాటు ఇతర ఎంపీలు విద్యార్థినులను అభినందించారు.
Updated Date - 2023-08-02T00:00:47+05:30 IST