ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఎచ్చెర్ల ఎమ్మెల్యే కిరణ్‌కు అసమ్మతి సెగ

ABN, First Publish Date - 2023-06-26T00:18:05+05:30

ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌కు సొంత పార్టీ నేతల నుంచే అసమ్మతి సెగ తగిలింది. ఆయనకు వ్యతిరేకంగా పార్టీ లోని ద్వితీయ శ్రేణి నాయకులు లావేరు మండలం పెదలింగాల వలసలో ఆదివారం భారీ సభను ఏర్పాటు చేశారు.

సభను అడ్డుకుంటున్న పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లావేరు, జూన్‌ 25: ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌కు సొంత పార్టీ నేతల నుంచే అసమ్మతి సెగ తగిలింది. ఆయనకు వ్యతిరేకంగా పార్టీ లోని ద్వితీయ శ్రేణి నాయకులు లావేరు మండలం పెదలింగాల వలసలో ఆదివారం భారీ సభను ఏర్పాటు చేశారు. పెదలింగావలస తోట నుంచి వెంకటాపురం జంక్షన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. లింగాలవలస, వెంకటా పురం, పోతయ్యవలస, గోవిందపురం, బట్టుపాలెం, మురపాక, లావేరు, తదితర గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా పలు వురు నాయకులు మాట్లాడుతూ.. ఎచ్చెర్ల ఎమ్మెల్యేగా కిరణ్‌ కుమార్‌ గెలు పునకు తాము ఎంతో కృషి చేశామన్నారు. ఆయన గెలిచాక తమను పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు నచ్చిన వారికి ఎమ్మెల్యే వత్తాసు పలుకుతున్నారన్నారు. పదవులను, కాంట్రాక్ట్‌ పనులను వారికే అప్పగిస్తు న్నారని, తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ ఆయనకే టిక్కెట్‌ ఇస్తే తాము సహక రించమని తెగేసి చెప్పారు. జగన్‌ ముద్దు.. కిరణ్‌ వద్దు అని నినాదాలు చేశారు. వీరి సభను లావే రు పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేకుండా ర్యాలీలు, సభలను నిర్వహించ రాదని తెలిపారు. లావేరు సర్పంచ్‌ వట్టి సత్యనారాయణ, గోవిందపురం మాజీ సర్పంచ్‌ గొర్లె రామినాయుడు, కొత్తకోట మాజీ సర్పంచ్‌ శివంగం నాగరాజు, నాయకులు లుకలాపు సూర్యనారాయణ, తేనెల సురేష్‌ కుమార్‌, మీసాల జగన్‌, పి.రమణ ను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువెళ్లి సాయంత్రం వరకు ఉంచారు. జేఆర్‌ పురం సీఐ ఆదాం, లావేరు ఎస్‌ఐ కోటేశ్వరరావు వారిని మందలించి వదిలేశారు.

Updated Date - 2023-06-26T00:18:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising