ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ అనాలోచిత చర్యలతో రైతులకు ఇబ్బందులు

ABN, First Publish Date - 2023-02-06T23:38:24+05:30

ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో అనాలోచిత చర్యల వల్ల వేలాది మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష అన్నారు. రైతుల సమస్యలపై సోమవారం పార్టీ కార్యాలయం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీవో సీతారామమూర్తికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభు త్వం ప్రవేశపెట్టిన ముందస్తు ఈకేవైసీ విధానంతో రైతులు ఏడాది పొడవునా పండించిన ధాన్యం విక్రయానికి ఇబ్బందులు పడి తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గౌతు శిరీష

పలాస, ఫిబ్రవరి 6: ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో అనాలోచిత చర్యల వల్ల వేలాది మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష అన్నారు. రైతుల సమస్యలపై సోమవారం పార్టీ కార్యాలయం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీవో సీతారామమూర్తికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభు త్వం ప్రవేశపెట్టిన ముందస్తు ఈకేవైసీ విధానంతో రైతులు ఏడాది పొడవునా పండించిన ధాన్యం విక్రయానికి ఇబ్బందులు పడి తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్బీకేల్లో ధాన్యం విక్రయానికి ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయని, దూర ప్రాం తాల్లో ఉన్న మిల్లులకు ధాన్యం కేటాయిస్తూ అను మతి పత్రాలు (ట్రక్‌షీట్‌) వస్తుండడంతో రవాణా చార్జీలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. తీరా మిల్లులకు తీసుకువెళ్లినా మిల్లర్లు తీసుకోవడం లేదని వాపోయారు. లక్ష్యం పూర్తయిందని ప్రభుత్వ ఆదేశాలతో కొనుగోలు చేస్తామని చెబుతుండడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే నియో జకవర్గంలో రైతుల వద్ద ధాన్యం బస్తాలు పంట పొలాల్లోనే ఉండి పోయా యని, వాటి కాపలాకు రైతులు తీవ్ర వ్యయప్రయాసలకు గురవుతున్నా రన్నారు. తక్షణం ప్రభుత్వం స్పందించి నిలువ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదు కోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు వజ్జ బాబూరావు, లొడగల కామేశ్వరరావు యాదవ్‌, పీరుకట్ల విఠల్‌రావు, గాలి కృష్ణారావు, గురిటి సూర్యనారాయణ, బడ్డ నాగ రాజు, సప్ప నవీన్‌, యవ్వారి మోహనరావు, అంబటి కృష్ణమూర్తి, సూరాడ మోహనరావు, టంకాల రవి శంకర్‌ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

చెరువులను పరిరక్షించండి

నరసన్నపేట: పట్టణంలో విలువైన చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని, తక్షణం వీటిపై తగు చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయ కులు డిమాండ్‌ చేశారు. సోమవారం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద చెరువుల ఆక్రమణలపై నిరసన వ్యక్తం చేశారు. జగన్నాథపురానికి చెందిన వార్డు సభ్యు డు చెరువులను, కాలువలను ఆక్రమిస్తు న్నా అధికారులు తూతూ మంత్రంగా చర్యలు చేపడుతున్నారన్నారు. నరసన్న చెరువును స్థానిక ప్రజా ప్రతినిధులు ఆక్ర మించి మట్టితో కప్పివేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం తహసీల్దార్‌ సింహాచలానికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల, పట్టణ అధ్యక్షులు శిమ్మ చంద్ర శేఖర్‌, కింజరాపు రామారావు, నేతలు గొద్దు చిట్టిబాబు, ఊణ్న వెంకటేశ్వరరావు, పీస కృష్ణ, బోయన సతీష్‌, కోరాడ రామచంద్రరావు, సీతాపతి, చలపాక మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T23:38:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising