అమృత్ భారత్‌తో రైల్వేస్టేషన్ల అభివృద్ధి
ABN, First Publish Date - 2023-03-05T23:37:20+05:30
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అమృత్ భారత్‌లో భాగంగా రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేసి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఈస్ట్‌కోస్ట్ రైల్వే డీఆర్‌ఎం అనూప్ శతపతి అన్నారు.
- ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు
- ఈస్ట్‌కోస్ట్ రైల్వే డీఆర్‌ఎం అనూప్ శతపతి
ఆమదాలవలస/ టెక్కలి రూరల్, మార్చి 5: కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అమృత్ భారత్‌లో భాగంగా రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేసి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఈస్ట్‌కోస్ట్ రైల్వే డీఆర్‌ఎం అనూప్ శతపతి అన్నారు. ఆదివారం శ్రీకాకుళం రోడ్డు(ఆమదాల వలస), నౌపడ రైల్వేస్టేషన్లను ఆయన సందర్శించారు. ప్లాట్‌ఫారాలు, పార్కింగ్ ప్రాంతం, బుకింగ్ కౌంటర్‌లు, స్టేషన్లలో సమస్యలను పరిశీలించారు. ప్రయాణికులు వేచి ఉండే స్థలాలతో పాటు మౌలిక సదుపా యాలపై ఆరా తీశారు. పలువురు ప్రయాణికులు, స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. తమ డివిజన్ పరిధిలోని 60 రైల్వేస్టేషన్లకు గాను 16 స్టేషన్లు అమృత్ భారత్ పఽథకం కింద అభివృద్ధి చేయనున్నట్టు వెల్లడించారు. అమృత్ భారత్ పఽథకం నిధులతో ప్లాట్‌పారాలకు ఇరువైపులా ప్రయాణీకులకు వెయిటింగ్ హాళ్లు, వీఐపీ లాంజ్, సర్కిలేటింగ్ ఏరియా, వాహనాల పార్కింగ్ సెంటర్లు, టికెట్ కౌంటర్లు, లిఫ్ట్టులు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ఎస్కలేటర్లు వంటి సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. గుణుపూర్ వరకు పర్యటించ నున్నట్లు తెలిపారు. స్టేషన్ల అభివృద్ధికి అవసరమైన సదుపాయాల నివేదికను ఉన్నతాధికారులకు పంపను న్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డీఆర్‌ఎం సుధీర్ కుమార్, గతిశక్తి చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ టీఎం రావు, మల్లేశ్వరరావు, మొదలవలస రవి, రైల్వే అధికా రులు, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2023-03-05T23:37:20+05:30 IST