ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో సైకిల్‌ పాలన రావాలి

ABN, First Publish Date - 2023-02-06T23:35:24+05:30

రాష్ట్రంలో సైకో పాలన పోవాలంటే సైకిల్‌ అధికారంలో రావాలని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జి బగ్గు రమణ మూర్తి అన్నారు. సోమవారం చిక్కాలవలసలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు.

చిక్కాలవలసలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘యువగళం’తో వైసీపీ నాయకుల్లో వణుకు

మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

నరసన్నపేట, ఫిబ్రవరి 6: రాష్ట్రంలో సైకో పాలన పోవాలంటే సైకిల్‌ అధికారంలో రావాలని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జి బగ్గు రమణ మూర్తి అన్నారు. సోమవారం చిక్కాలవలసలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘యువ గళం’ పేరుతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపడుతున్న పాదయాత్రతో వైసీపీ నాయకుల్లో వణుకు పుట్టిందన్నారు. రావణ పాలనను అంతమెందించి రామరాజ్యం తీసుకువచ్చేందుకు రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. వైసీపీ ప్రభుత్వ నిరంకుశ విధానాలపై ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు శిమ్మ చంద్ర శేఖర్‌, సర్పంచ్‌ ముంజి శ్రీరాములు, రంగనాయకులు, అడపా చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

చంగుడి, నల్లబొంతు గ్రామాల్లో...

పాతపట్నం: ఏఎస్‌కవిటి పంచాయతీ నల్ల బొంతు, చంగుడి గ్రామాల్లో సోమవారం ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక నాయకులు కోగాపు సంజీవరావు, కొంచాడ రుద్రశేఖర్‌, రోకళ్ల శివాజీ రెడ్డి ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై అవగా హన కలిగించారు. టీడీపీ క్లస్టర్‌-1 ఇన్‌చార్జి పైల లక్ష్మయ్య పర్యవేక్షించారు. కార్యక్రమం లో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.

ప్రజా వ్యతిరేక విధానాలతో ఇక్కట్లు

సారవకోట (జలుమూరు): రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు ఇబ్బందులు పడు తున్నారని టీడీపీ మండల అధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ అన్నారు. కేలవలస పంచాయతీ పదంపురం గ్రామంలో సోమవారం ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు. ఇంటిం టికీ వెళ్లి వైసీపి వైఫల్యాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. వైసీపి మూడున్నరేళ్ల పాలనలో ప్రజలకు చేసిన అన్యాయా లను వివరించారు. కార్యక్రమంలో నాయకులు పట్ట ఉమామహేశ్వరరావు, శిమ్మ రామకృష్ణ, రావాడ అప్పలనాయుడు, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T23:35:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising