ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కార్పొరేట్‌, ప్రభుత్వ పాఠశాలలు బంద్‌ రేపు

ABN, First Publish Date - 2023-07-03T23:34:03+05:30

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఫీజు లు వసూలు చేస్తున్న కార్పొరేట్‌, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈనెల 5న కార్పొరేట్‌, ప్రభుత్వ పాఠశాలలు రాష్ట్ర బంద్‌ నిర్వహిస్తున్నట్లు ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మేడి అచ్చెన్నాయుడు తెలి పారు. ఈ మేరకు సోమవారం పోస్టర్‌ను ఆవిష్కరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నరసన్నపేట: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఫీజు లు వసూలు చేస్తున్న కార్పొరేట్‌, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈనెల 5న కార్పొరేట్‌, ప్రభుత్వ పాఠశాలలు రాష్ట్ర బంద్‌ నిర్వహిస్తున్నట్లు ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మేడి అచ్చెన్నాయుడు తెలి పారు. ఈ మేరకు సోమవారం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అధిక ఫీజులు వసూలు చేసి విద్యార్థుల తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నాయని విమర్శిం చారు. కార్పొరేట్‌ విద్యా సంస్థలు అధిక ఫీజులు మాత్రమే కాకుండా పుస్తకాలు, యూనిఫారాలు, అడ్మిషన్‌ ఫీజుల పేరుతో దోచుకుంటున్నాయన్నారు. 5న నిర్వహిస్తున్న పాఠశాలల బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో విజయ్‌, కె.ప్రవీణ్‌, జి.తిరుపతి, కె.శ్యామలరావు, యోగి, రవి, సోమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

‘కార్పొరేట్‌’ ఫీజుల దోపిడీని అరికట్టాలి

టెక్కలి: ప్రైవేట్‌, కార్పొరేట్‌ కళాశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, ఈ దోపిడీ అరికట్టాలని ఆంధప్రదేశ్‌ నిరుద్యోగ పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సూర్యం డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం ఆర్‌ఐవో టి.దుర్గా రావును కలిసి వినతిపత్రం అందించారు. యూనిఫారాలు, పుస్తకాలు అధిక ధరలకు విక్రయిస్తున్నారన్నారు. ఫీజుల వివ రాలు నోటీస్‌ బోర్డులో పెట్టాలని, విద్యాహక్కు చట్టం ప్రకారం 25 శాతం పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు దేవరాజు తదితరులున్నారు.

Updated Date - 2023-07-03T23:34:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising