ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘గడపగడపకూ’లో ఎమ్మెల్యే కిరణ్‌కు నిలదీతలు

ABN, First Publish Date - 2023-03-25T23:55:34+05:30

ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌కు.. ‘గడపగడపకూ మన ప్రభుత్వం’ కార్య క్రమంలో ప్రజల నుంచి నిలదీతలు ఎదురయ్యాయి. శనివారం జి.సిగడాం మండలం నిద్దాంలో ఎమ్మెల్యే కిరణ్‌కుమార్‌ పర్యటించగా.. పలు సమస్యలపై స్థాని కులు ప్రశ్నించారు.

ఎమ్మెల్యేను తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతున్న నిద్దాం వాసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

జి.సిగడాం, మార్చి 25: ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌కు.. ‘గడపగడపకూ మన ప్రభుత్వం’ కార్య క్రమంలో ప్రజల నుంచి నిలదీతలు ఎదురయ్యాయి. శనివారం జి.సిగడాం మండలం నిద్దాంలో ఎమ్మెల్యే కిరణ్‌కుమార్‌ పర్యటించగా.. పలు సమస్యలపై స్థాని కులు ప్రశ్నించారు. ‘‘అర్హులకు ప్రభుత్వ పథకాలు అం దడం లేదు. పథకాల మంజూరులో కూడా రాజకీయం, పక్షపాతమేనా?. ఈ ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టవా?’’ అని జనసేన నాయకుడు మీసాల రవికు మార్‌ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ను నిలదీశారు. ‘‘గృహాలను అధికార పార్టీకి చెందిన వారికే మం జూరు చేస్తున్నారు. ప్రతిపక్షం వారిపై పక్షపాతం చూపిస్తు న్నారు. డ్వాక్రా మహిళలకు అందిస్తున్న సున్నా వడ్డీ కూడా ఇదే చందంగా ఉంది. మీరు చెబుతున్నారో లేక గ్రామ స్థాయి నాయకులు చేస్తున్నారో తెలియదు.. కానీ పథకాలకు రాజకీయ రంగు పులుముతున్నారు. పాల ఖండ్యాం కూడలి నుంచి నిద్దాం పంచాయతీ అద్వానం పేట వరకు వెళ్లే బీటీ రహ దారి శిథిలావస్థకు చేరు కున్నా పట్టించుకొనే నాథు డే కరువయ్యాడు. కొత్త రోడ్డు నిర్మించకపోయినా కనీసం మరమ్మతులైనా చేపట్టాలి’’ అని రవికుమార్‌ కోరారు. గ్రామంలోని ఎగు వ వీధిలో తాగునీటి సమ స్యను పరిష్కరించాలని గ్రామస్థులు ఎమ్మెల్యేను వేడుకున్నారు. కార్యక్రమం లో ఎంపీపీ మీసాల సత్య వతి, జడ్పీటీసీ సభ్యుడు కాయల రమణ, వైస్‌ ఎంపీపీ మీసాల సాధ్వీమణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-25T23:55:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising