ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

డీఈవోపై ‘స్పందన’లో ఫిర్యాదు

ABN, First Publish Date - 2023-06-26T23:41:16+05:30

ఉపాధ్యాయ బదిలీల్లో అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని పలువురు ఉపాధ్యాయులు ఆరోపించారు. డీఈవో తిరుమల చైతన్య వైఖరిని నిరసిస్తూ.. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

స్పందనలో ఫిర్యాదు చేస్తున్న ఉపాధ్యాయులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- టీచర్ల బదిలీల్లో అక్రమాలపై..

- న్యాయం చేయాలని డిమాండ్‌

అరసవల్లి, జూన్‌ 26: ఉపాధ్యాయ బదిలీల్లో అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని పలువురు ఉపాధ్యాయులు ఆరోపించారు. డీఈవో తిరుమల చైతన్య వైఖరిని నిరసిస్తూ.. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం జడ్పీలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి పేడాడ ప్రభాకరరావు ఆధ్వర్యంలో డీఈవోపై ఫిర్యాదు చేశారు. ‘ప్రధానంగా కలెక్టర్‌ ఆమోదించిన 12మంది మెడికల్‌ ప్రిఫరెన్షియల్‌ పరిగణించకపోవడం. ఆరుగురు సాంఘికశాస్త్ర ఉపాధ్యాయులకు మాన్యువల్‌గా రీకౌన్సెలింగ్‌ నిర్వహించడం. 8 ఏళ్లు పూర్తికాకపోయినా కొందరు మహిళా ఉపాధ్యాయులకు స్పౌజ్‌ పాయింట్లు కేటాయించడం.. వంటి అక్రమాలు జరిగాయి. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ బదిలీల ప్రక్రియను అస్తవ్యస్తంగా నిర్వహించారు. దీనివల్ల మూడు వారాలు కావస్తున్నా, పదుల సంఖ్యలో ఉపాధ్యాయులు బదిలీ ఉత్తర్వులు పట్టుకుని ఏ పాఠశాలకు వెళ్లాలో తెలియక డీఈవో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అయినా సరే డీఈవోలో చైతన్యం లేదు. ముగ్గురు విద్యార్థులున్న పలాస మండలం వీరభద్రపురం ప్రాథమికోన్నత పాఠశాలలో రెండవ పోస్టు కేటాయించారు. 1, 2 తరగతుల్లో 52 మంది ఉన్న గుప్పెడుపేటకు రెండవ పోస్టు కేటాయించలేదు. ఇలా అస్తవ్యస్తంగా బదిలీ ప్రక్రియ సాగింది. సమస్య పరిష్కరించాలి’ అని కోరుతూ ఉపాధ్యాయులు వినతిపత్రం అందజేశారు. లేదంటే డీఈవో వైఖరిని నిరసిస్తూ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.

Updated Date - 2023-06-26T23:41:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising