బ్యాంకు ఖాతాల నుంచి నగదు విత్‌డ్రా
ABN, First Publish Date - 2023-04-03T23:43:15+05:30
తన ప్రవేయం లేకుండా రెండు బ్యాంకుల్లోని వ్యక్తిగత ఖాతాల నుంచి నగదు విత్‌డ్రా అయిందని, దీనిపై దర్యాప్తు చేసి న్యాయం చేయాలని అల్లాడ గ్రామానికి చెందిన రిటైర్డు ఉపాధ్యాయుడు సనపల వెంకటరమణమూర్తి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- పోలీసులను ఆశ్రయించిన బాధితుడు
జలుమూరు: తన ప్రవేయం లేకుండా రెండు బ్యాంకుల్లోని వ్యక్తిగత ఖాతాల నుంచి నగదు విత్‌డ్రా అయిందని, దీనిపై దర్యాప్తు చేసి న్యాయం చేయాలని అల్లాడ గ్రామానికి చెందిన రిటైర్డు ఉపాధ్యాయుడు సనపల వెంకటరమణమూర్తి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే వైజాగ్ సైబర్ పోలీసులకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసినట్టు బాధితుడు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. తన ఖాతా నుంచి మూడు పర్యాయాలు రూ.19 వేలు విత్‌డ్రా అయి నట్లు మెసేజ్‌లు వచ్చాయన్నారు. నరసన్నపేట స్టేట్‌బ్యాంకు ఖాతా నుంచి ఆదివారం రాత్రి రూ.10 వేలు, సోమవారం తెల్లవారు జామున రూ.7500 ఏఈపీఎస్ ద్వారా విత్‌డ్రా జరిగిందనట్లు మెసేజ్‌లు వచ్చాయన్నారు. అలాగే నరసన్నపేట యూనియన్ బ్యాంకు ఖాతా నుంచి సోమవారం ఉదయం రూ.1500 విత్‌డ్రా జరిగినట్లు మెసేజ్ రావడంతో వెంటనే ఆయా బ్యాంకులకు వెళ్లి సమాచారం అందించానని తెలిపారు. దీనిపై ఎస్‌ఐ పి.పారినాయుడును వివరణ కోరగా ఏఈపీఎస్ ద్వారా బ్యాంకు ఖాతాల నుంచి నగదు విత్‌డ్రా జరిగినప్పుడు పూర్తి బాధ్యత బ్యాంకు అధికారులదేనని 15 రోజుల్లోగా తిరిగి నగదును వాపస్ చేయాలన్నారు. ఈ విషయాన్ని ఫిర్యాదుదారులకు చెప్పామని, బ్యాంకు అధికారులను సంప్రదించాలని సూచించినట్టు తెలిపారు.
Updated Date - 2023-04-03T23:43:15+05:30 IST