ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదివాసీ ఎమ్మెల్యేలు, ఎంపీ దిష్టిబొమ్మల దహనం

ABN, First Publish Date - 2023-04-03T00:14:52+05:30

బోయ, వాల్మీకి, బెంతొరియాలను ఎస్టీ జాబితాలో చేరుస్తూ అసెంబ్లీలో తీర్మానించి కేంద్రానికి పంపినందుకు వ్యతిరేకంగా పురుషోత్తకర్ర గిరిజన గ్రామంలో రాష్ట్రంలోని ఆదివాసీ ఎమ్మెల్యేలు, ఎంపీ దిష్టిబొమ్మలను ఊరేగించి శనివారం రాత్రి దహనం చేసి నిరసన తెలిపారు.

ఆదివాసీ ఎమ్మెల్యేలు, ఎంపీ దిష్టిబొమ్మలను ఊరేగిస్తున్న గిరిజనులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

సారవకోట (జలుమూరు), ఏప్రిల్‌ 2: బోయ, వాల్మీకి, బెంతొరియాలను ఎస్టీ జాబితాలో చేరుస్తూ అసెంబ్లీలో తీర్మానించి కేంద్రానికి పంపినందుకు వ్యతిరేకంగా పురుషోత్తకర్ర గిరిజన గ్రామంలో రాష్ట్రంలోని ఆదివాసీ ఎమ్మెల్యేలు, ఎంపీ దిష్టిబొమ్మలను ఊరేగించి శనివారం రాత్రి దహనం చేసి నిరసన తెలిపారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి మాట్లాడుతూ.. గిరిజనులకు అన్యాయం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీర్మానానికి మద్దతిస్తున్న ఏడుగురు ఆదివాసీ ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని వెనక్కు తీసుకోవాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షుడు చింతపల్లి భాస్కరరావు, కొంకాడ మన్మథరావు, విజయకుమార్‌, జన్ని సుదర్శన్‌, జన్ని నీలయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-03T00:14:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising