బిహార్ ముఠా పనేనా?
ABN, First Publish Date - 2023-01-19T23:30:39+05:30
డేగలపోలారు గ్రా మంలో సేనాపతి దు ర్యోధనరావు ఇంట్లో బుధవారం రాత్రి చో రీకి పాల్పడింది బిహార్ ముఠాగా పో లీసులు అనుమాని స్తున్నారు.
మెళియాపుట్టి: డేగలపోలారు గ్రా మంలో సేనాపతి దు ర్యోధనరావు ఇంట్లో బుధవారం రాత్రి చో రీకి పాల్పడింది బిహార్ ముఠాగా పో లీసులు అనుమాని స్తున్నారు. క్లూస్ టీం సీఐ జీవీ రమణ ఆధ్వర్యంలో సిబ్బంది గురువారం ఆ గ్రామా నికి వెళ్లి పరి శీలించారు. దొంగతం జరిగిన తీరును బాధితులను అడిగి తెలు సుకున్నారు. వేలిముద్రలు, దుండగులు వాడిన మారణాయుధాలను సేకరించా రు. దొంగలు హిందీలో మాట్లాడడంతో పాటు తుపాకులు, కత్తులు చూపించి బెదిరించిన తీరుపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ తరహా దొంగత నాలకు పాల్పడేది ఎక్కువగా బిహార్ ముఠాలుగా అనుమానిస్తు న్నారు. దీనికి తోడు ఈ ప్రాంతంలో అధికంగా ఉన్న గ్రానైట్ పాలిసింగ్ యూని ట్లలో పని చేస్తున్నవారు ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు చెందినవారు కావడంతో ఆ దిశగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్‌టీం ఎస్‌ఐ భరత్, పాతపట్నం సీఐ వినోద్ బాబు, ఇన్‌చార్జి ఎస్‌ఐ కామేశ్వరావు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-01-19T23:30:41+05:30 IST