పేకాట రాయుళ్ల అరెస్టు
ABN, First Publish Date - 2023-09-04T00:06:34+05:30
తోటపాలెం గ్రామ సమీపాన నాగావళి నది ఒడ్డున పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.
ఎచ్చెర్ల, సెప్టెంబరు 3: తోటపాలెం గ్రామ సమీపాన నాగావళి నది ఒడ్డున పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు. పక్కా సమాచారం మేరకు ఆదివారం సిబ్బందితో దాడి చేసి వారిని పట్టుకుని, వారి నుంచి రూ.33,100 స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. వారిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
- గార: శ్రీకూర్మం పంచాయతీ నగిరెడ్లపేట సమీపంలో పేకాట ఆడుతున్న 11 మందిని అరెస్టు చేసినట్టు సీఐ కామేశ్వరరావు తెలిపారు. పక్కా సమాచారం మేరకు ఆదివారం సిబ్బందితో దాడి చేసినట్టు చెప్పారు. వారి నుంచి రూ.17,200 నగదుతోపాటు 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. కేసు నమోదు చేసినట్టు చెప్పారు.
Updated Date - 2023-09-04T00:06:34+05:30 IST