నేడు పలాసలో ఆర్మీ క్యాంటీన్ ప్రారంభం
ABN, First Publish Date - 2023-01-19T23:29:02+05:30
చినబాడాం పరిధి కాశీబుగ్గ రైల్వే ఎల్‌సీ గేటు పక్కన శుక్రవారం ఆర్మీ క్యాంటీన్ ప్రారంభించినున్నట్టు మాజీ సైనికుల సంక్షేమ సంఘం పలాస శాఖ అధ్యక్షులు ఇళ్ల మన్మధరావు తెలిపారు.
కాశీబుగ్గ: చినబాడాం పరిధి కాశీబుగ్గ రైల్వే ఎల్‌సీ గేటు పక్కన శుక్రవారం ఆర్మీ క్యాంటీన్ ప్రారంభించినున్నట్టు మాజీ సైనికుల సంక్షేమ సంఘం పలాస శాఖ అధ్యక్షులు ఇళ్ల మన్మధరావు తెలిపారు. గురువారం ఆర్మీ క్యాంటీన్ ఆవ రణలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఆర్మీ క్యాంటీన్‌ను ఆంధ్ర తెలంగాణ సబ్ ఏరియా డిఫ్యూటీ జనరల్ అధికారి, కమాండింగ్ బ్రిగేడియర్ కె.సోమశంకర్ ప్రారంభిస్తారని అన్నారు. ఈ ఆర్మీ క్యాంటీన్ పలాస, మందస, వజ్రపుకొత్తూరు, నందిగాం, మెళియాపుట్టి, పాతపట్నం, సంతబొమ్మాలి, ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట మండలాల్లో ఉన్న దాదాపు మూడు వేల మంది మాజీ సైనికులకు, వారి కుటుంబ సభ్యులకు ఉపయోగపడుతుందన్నారు. ఈ క్యాంటీన్ ఆర్మీ కుటుంబ సభ్యులు వినియోగించుకోవాలని కోరారు.
Updated Date - 2023-01-19T23:29:04+05:30 IST