ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అరాచక పాలన.. ఇంకెన్నాళ్లు?

ABN, First Publish Date - 2023-05-02T00:15:01+05:30

రాష్ట్రంలో అరాచక పాలన ఇంకెన్నాళ్లు.. అంటూ వైసీపీ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. జగన్మోహన్‌రెడ్డిని ఏ1 ఖైదీగా, భూములు, మైనింగ్‌, లిక్కర్‌ మాఫియా కింగ్‌గా, రైతు వ్యతిరేకిగా, రాబందుగా, బాబాయి హంతకుడిగా, కీచకుడిగా, భస్మాసురుడిగా, అబద్దాలకోరుగా ఆరోపించారు.

టెక్కలిలో సీఎం దిష్టిబొమ్మతో పాటు టీడీపీ శ్రేణులను అడ్డుకుంటున్న పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- వైసీపీ తీరుకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణుల నిరసన

- 10 తలల రావణాసురుడిగా జగన్‌ కరపత్రాల దహనం

- దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకున్న పోలీసులు

అరసవల్లి/టెక్కలి/ఇచ్ఛాపురం రూరల్‌ (కవిటి), మే 1: రాష్ట్రంలో అరాచక పాలన ఇంకెన్నాళ్లు.. అంటూ వైసీపీ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. జగన్మోహన్‌రెడ్డిని ఏ1 ఖైదీగా, భూములు, మైనింగ్‌, లిక్కర్‌ మాఫియా కింగ్‌గా, రైతు వ్యతిరేకిగా, రాబందుగా, బాబాయి హంతకుడిగా, కీచకుడిగా, భస్మాసురుడిగా, అబద్దాలకోరుగా ఆరోపించారు. ఈ మేరకు సోమవారం జిల్లావ్యాప్తంగా ‘జగనాసుర అవినీతి, నేరరాక్షసుడు’గా ముఖ్యమంత్రి జగన్‌ను అభివర్ణిస్తూ సీఎం దిష్టిబొమ్మను, కరపత్రాలను దహనం చేశారు. టెక్కలి, కవిటి ప్రాంతాల్లో దిష్టిబొమ్మ దహనాన్ని పోలీసులు అడ్డుకోవడంతో.. ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

- శ్రీకాకుళంలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఆధ్వర్వంలో నిరసన చేపట్టారు. 80 అడుగుల రోడ్డులోని జిల్లా టీడీపీ కార్యాలయం వద్ద పది తలల రావణాసురుడుగా జగన్‌ కరపత్రాలను దహనం చేశారు. ఆమె మాట్లాడుతూ.. ఒక్కచాన్స్‌ పేరుతో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను జగన్‌ మోసం చేశారని ఆరోపించారు. ‘సీబీఐ కేసు నుంచి తప్పించుకునేందుకు ఢిల్లీ పర్యటనలకే జగన్‌కు సమయమంతా సరిపోతోంది. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం ఆలోచించడం లేదు. వైసీపీ పాలనలో అక్రమాలు బాగా పెరిగాయి. వచ్చే ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి పట్టం కట్టడం ఖాయమ’ని లక్ష్మీదేవి తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పీఎంజే బాబు, తోణంగి వెంకన్నయాదవ్‌, పార్టీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్‌, రాష్ట్ర తెలుకల సాధికార కమిటీ సభ్యుడు కొమ్మనాపల్లి వెంకటరామరాజు, బీసీ సెల్‌ సోషల్‌మీడియా కన్వీనర్‌ బుక్కా యుగంధర్‌, పట్నాల పార్వతీశం, మల్ల నర్సింగరావు, గంగు నాగేశ్వరరావు, వెలమల శ్రీనివాస్‌, మెండ గిరీష్‌, శివప్రసాద్‌ దేవ్‌, సీపాన రమ, కవ్వాడ సుశీల పాల్గొన్నారు.

- కవిటిలో ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ ఆధ్వర్యంలో ‘జగనాసుర’ కార్యక్రమం నిర్వహించారు. జగన్‌ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేతికి మట్టి అంటకుండా నేరాలు చేస్తున్న జగనాసుర పాలనను అంతమోందించాలని పిలుపునిచ్చారు. ‘‘జగన్‌.. సిగ్గులేకుండా తండ్రి మరణాన్ని వాడుకుని ఓదార్పు పేరుతో 2014 ఎన్నికలకు ముందు రాజకీయంగా ఎదగాలని ప్రయత్నించాడు. 2019 ఎన్నికల సమయంలో సొంత బాబాయిని హతమార్చి.. సంకల్ప యాత్రకి నాంది పలికి శవరాజకీయాలు చేశాడు. 2024లో జగన్‌ పాలనకు స్వస్తి చెప్పాల’’ని ఎమ్మెల్యే అశోక్‌ కోరారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీలు బి.రమేష్‌, పి.కృష్ణారావు, మాజీ ఎంపీపీ దక్కత డిల్లీరావు, సీపాన వెంకటరమణ, డి.కామేష్‌ పాల్గొన్నారు.

- టెక్కలిలో సీఎం దిష్టిబొమ్మ దహనానికి టీడీపీ నేతలు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. టెక్కలిలో టీడీపీ కార్యాలయానికి సీఐ చంద్రమౌళి, ఎస్‌ఐలు మహ్మద్‌ఆలీ, రమేష్‌, పోలీసులు చేరుకున్నారు. దిష్టిబొమ్మ దహనం చేయవద్దని, ఒకవేళ చేస్తే అరెస్టులు తప్పవని పోలీసులు హెచ్చరించారు. దీంతో ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. దీంతో పోలీసుల బలవంతంగా దిష్టిబొమ్మను స్వాధీనం చేసుకుని.. టీడీపీ శ్రేణులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో బగాది శేషగిరిరావు, మట్ట పురుషోత్తం, దమయంతి, కింగ్‌, హనుమంతు రామకృష్ణ, దల్లి ప్రసాద్‌రెడ్డి, రెయ్యి ప్రీతీష్‌, లవకుమార్‌, కామేసు, బాలకృష్ణ, యర్రబ్బాయి పాల్గొన్నారు.

Updated Date - 2023-05-02T00:15:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising